YS Sharmila | మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు : వైఎస్ షర్మిల
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టాడని ఆరోపించారు.
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టాడని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని అన్నారు.
‘కానీ, ఆయన (చంద్రబాబు నాయుడు) ఇప్పుడు ముఖ్యమంత్రి. కాబట్టి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని మేం చంద్రబాబు నాయుడును కోరుతున్నాం. ఇంకా ఆలస్యమవడాన్ని ఆంధ్రప్రదేశ్ భరించలేదు’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఇప్పటికే చాలా బాధలు అనుభవించిందని, ఇప్పటి ప్రభుత్వమైనా పరిస్థితిని చక్కదిద్దాలని షర్మిల సూచించారు. గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తాను ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

