AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
AP News | ‘అర్నబ్ తుపాను (Cyclone Arnab)’ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దాంతో నదులకు వరద పోటెత్తింది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల్లోకి భారీగా వరదనీరు చేరింది. దాంతో పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
AP News : ‘అర్నబ్ తుపాను (Cyclone Arnab)’ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దాంతో నదులకు వరద పోటెత్తింది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల్లోకి భారీగా వరదనీరు చేరింది. దాంతో పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఎగువన ఒడిశాలోని భగలట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతోపాటు భారీ వర్షాలతో ఇచ్ఛాపురం మండలంలో బాహుదా నదికి వరదనీరు పోటెత్తింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా నదిలో వరద ప్రవహిస్తోంది. దాంతో అధికారులు బాహుదా నదికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చెన్నై-కోల్‌కతా హైవేపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లోకి బాహుదా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
లొద్దపుట్టిలో నడుములోతు నీరు ప్రవహిస్తుండంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సోంపేట మండలం లక్కవరం పరిసరాల్లో భారీవర్షాలకు పంటలు నీట మునిగాయి. ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. నేడు కూడా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. హిరమండలంలో గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. నదిలోకి వస్తున్న వరదను అధికారులు దిగువకు పంపిస్తున్నారు. మహేంద్ర తనయ నదిలోనూ వరద పెరుగుతున్నది. పాతపట్నం మండలం చంగుడి, కె గోపాలపురం, అచ్యుతాపురం గ్రామాల్లోకి వరదనీరు చేరుతున్నది.
తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో ఇచ్ఛాపురం-సోంపేట మధ్య రైల్వేట్రాక్ పైకి భారీగా వరదనీరు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది. బరంపురం-విశాఖ (18525), విశాఖ-బరంపురం (18526), విశాఖ-భువనేశ్వర్ (22820) రైళ్లు రద్దయ్యాయి. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సమాచారం కోసం ప్రయాణికులు 08942 286213, 08942 286245 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

