ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
New districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. సోమవారం (ఈ నెల 4) నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని పేర్కొన్నది. అన్ని జిల్లాకు ఏప్రిల్ 4 అపాయింటెడ్ డే గా ఉంటుందని తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. సోమవారం (ఈ నెల 4) నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని పేర్కొన్నది. అన్ని జిల్లాకు ఏప్రిల్ 4 అపాయింటెడ్ డే గా ఉంటుందని తెలిపింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 13 జిల్లాలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా మరో 13 జిల్లాను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జిల్లాలు, రెవెన్యూ డివిజ్ల వివరాలు..
1. శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం: శ్రీకాకుళం
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి, శ్రీకాకుళం, పలాస
2. విజయనగరం జిల్లా
జిల్లా కేంద్రం: విజయనగరం
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి
3. మన్యం జిల్లా
జిల్లా కేంద్రం: పార్వతీపురం
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం
4. అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం: పాడేరు
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం జిల్లా
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం, విశాఖపట్నం
6. అనకాపల్లి జిల్లా
జిల్లా కేంద్రం: అనకాపల్లిని
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి
7. కాకినాడ జిల్లా
జిల్లా కేంద్రం: కాకినాడ
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం: అమలాపురంని
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట
9. తూర్పుగోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమ గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: భీమవరం
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, కొత్తగా భీమవరం
11. ఏలూరు జిల్లా
జిల్లా కేంద్రం: ఏలూరు
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
12. కృష్ణా జిల్లా
కేంద్రం: మచిలీపట్నం
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు
13. ఎన్టీఆర్ జిల్లా
జిల్లా కేంద్రం: విజయవాడ
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ, తిరువూరు
14. గుంటూరు జిల్లా
జిల్లా కేంద్రం: గుంటూరు
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి
15. బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం: బాపట్ల
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల, చీరాల
16. పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం: నరసరావుపేట
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి
17. ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం: ఒంగోలు
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, ఒంగోలు, కనిగిరి
18. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జిల్లా కేంద్రం: నెల్లూరు
రెవెన్యూ డివిజన్లు: నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు
19. కర్నూలు జిల్లా
జిల్లా కేంద్రం: కర్నూలు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ
20. నంద్యాల జిల్లా
జిల్లా కేంద్రం: నంద్యాల
రెవెన్యూ డివిజన్లు: నంద్యాల, డోన్, ఆత్మకూరు
21. అనంతపురం జిల్లా
జిల్లా కేంద్రం: అనంతపురం
రెవెన్యూ డివిజన్లు: కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్
22. శ్రీసత్యసాయి జిల్లా
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి
23. వైఎస్సార్ కడప జిల్లా
జిల్లా కేంద్రం: కడప
రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, బద్వేలు
24. అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం: రాయచోటి
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి, మదనపల్లి
25. చిత్తూరు జిల్లా
జిల్లా కేంద్రం: చిత్తూరు
రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, కొత్తగా పలమనేరు, కుప్పం, నగరి
26. తిరుపతి జిల్లా
జిల్లా కేంద్రం: తిరుపతి
రెవెన్యూ డివిజన్లు: సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

