పురుగుల బెడద.. తప్పించేదెలా?
దానిమ్మ సాగులో చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకుంటే.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాయ తొలిచే పురుగు: ఇది దానిమ్మ పండ్లకు తీవ్రనష్టం కలుగజేస్తుంది. ఒక్కోసారి 50 శాతానికి పైగా దిగుబడిని కోల్పోవాల్సి వస్తుంది.
పదెకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా చేనులో పురుగుల బెడద ఎక్కువగా కనిపిస్తున్నది. నివారణ మార్గాలు చెప్పండి.
-సీహెచ్ స్వామి, చొప్పదండి.
దానిమ్మ సాగులో చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకుంటే.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
కాయ తొలిచే పురుగు: ఇది దానిమ్మ పండ్లకు తీవ్రనష్టం కలుగజేస్తుంది. ఒక్కోసారి 50 శాతానికి పైగా దిగుబడిని కోల్పోవాల్సి వస్తుంది. సీతాకోకచిలుకలు పువ్వు/ పిందెలపై ఒక్కో గుడ్డును పెడతాయి. వీటినుంచి వచ్చే లార్వాలు కాయలోపలికి తొలుచుకొని పోయి.. గుజ్జును, గింజలను తింటాయి. కాయకు చేసిన రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా, బూజు వ్యాపించి కాయ కుళ్లి, రాలిపోతుంది. ఈ పురుగులను నివారించడానికి పూత, మొగ్గ దశలో ఉన్నప్పుడే.. లీటర్ నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 2 మి.లీ. ప్రొఫినోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. 15-20 రోజుల తరువాత లీటర్ నీటిలో 1 మి.లీ. డైక్లోరోవాస్ కలిపి మరోసారి పిచికారీ చేసుకోవాలి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- diseases
- pests
- Pomegranate
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

