‘థైరాక్సిన్’ అనే హార్మోన్లను విడుదల చేసే గ్రంథినే.. ‘థైరాయిడ్ గ్రంథి’ అంటారు. థైరాయిడ్ క్యాన్సర్ అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో మూడు రెట్లు అధికంగా కనిపిస్తుంది. ఇది మెడ కిందిభాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మనిషిలో హార్మోన్లను విడుదల చేసే పెద్ద గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ఇది మనిషి జీవ ప్రక్రియలన్నిటినీ నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ3, టీ4 టీఎస్‌హెచ్ పరీక్షల ద్వారా థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గులను తెలుసుకోవచ్చు.
హార్మోన్లలో హెచ్చు తగ్గుల లక్షణాలు :
కణితి అపరిమితంగా పెరగడం వల్లే :
థైరాయిడ్ గ్రంథి మీద ఏర్పడిన గడ్డ లేదా కణితి అపరిమితంగా పెరగడమే థైరాయిడ్ క్యాన్సర్. చాలామందిలో వయసు పెరిగేకొద్దీ కనిపించే కణుతుల్లో 95శాతం వరకూ నాన్ క్యాన్సర్ కణుతులే. ప్రధానంగా జెనటికల్ మ్యుటేషన్స్, రేడియేషన్‌కు అధికంగా గురవడం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు అతి సమీపంగా ఉండటం, కుటుంబ చరిత్రలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు) తదితర సమస్యలు థైరాయిడ్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
80శాతం మందిలో కనిపించే క్యాన్సర్ అదే :
థైరాయిడ్ క్యాన్సర్ ఐదు రకాలు. అందులో పాపిలరీ క్యాన్సర్ ఒకటి. థైరాయిడ్ క్యాన్సర్లలో 80శాతం వరకు కనిపించేది ఈ క్యాన్సరే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తీర ప్రాంతవాసుల్లో ఈ పాపిలరీ క్యాన్సర్ అధికంగా కనిపిస్తున్నది. పిల్లలు ఎక్కువగా రేడియేషన్‌కు గురైనప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 2. ఫాలిక్యులార్ థైరాయిడ్ క్యాన్సర్. 3. బెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్. 4. ఎనోప్లాసిక్టక్ థైరాయిడ్ క్యాన్సర్. ఇది చాలా అరుదైన, తీవ్రమైన క్యాన్సర్. 5. థైరాయిడ్ లింఫోమా.
లక్షణాలు :
ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు :
అల్ట్రాసౌండ్ నీడిల్ బయాప్సీ, న్యూక్లియర్ స్కాన్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, థైరాయిడ్ ఇమేజింగ్ తదితర పరీక్షల ద్వారా థైరాయిడ్ క్యాన్సర్‌ను నిర్ధారించడంతోపాటు వ్యాధి ఏ దశలో ఉంది? ఎంత వరకు వ్యాపించింది? అనే విషయాలను తెలుసుకోవచ్చు.
తీవ్రత ఆధారంగా చికిత్సా పద్ధతులు :
థైరాయిడ్ క్యాన్సర్ టైప్, స్టేజ్ ఆధారంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కేవలం కణితి వరకే తీసేయడం లేక మొత్తం థైరాయిడ్ గ్రంథినే తొలగించాల్సి వస్తుంది. ఆ తరువాత రేడియో యాక్టివ్ అయోడిన్, హార్మోన్ ట్రీట్మెంట్, బయటి నుంచి రేడియేషన్ ఇవ్వడం తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మెడ వద్ద ఉన్న చిన్న చిన్నగా ఉన్న థైరాయిడ్ గడ్డలను కీహోల్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. అయితే ఈ సర్జరీ అతి సున్నితమైనందున అనుభవజ్ఞులైన వైద్యులే చేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స తరువాత థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. తొలుత కొంతకాలం పాటు ఈ థెరపీని ఎక్కువగా ఇచ్చి, థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు పరిశీలించి సరైన మోతాదును నిర్ధారిస్తారు. సర్జరీ తరువాత కూడా ఎక్కడైనా క్యాన్సర్ కణాలు మిగిలి ఉంటే మళ్లీ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అందుకని ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. థైరాయిడ్ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ చికిత్స సక్సెస్ రేటు, రోగి జీవితకాలం వంటి అంశాలు వ్యాధి తీవ్రత, ఏ దశలో గుర్తించి చికిత్స అందించారు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. రేడియేషన్, న్యూక్లియర్ ప్లాంట్లకు దూరంగా ఉండటం ద్వారా ఈ క్యాన్సర్‌ను కొంత వరకు నివారించవచ్చు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121