Twinkle Khanna | ‘ట్వింకిల్’ కథల్లో సూపర్ స్టార్స్!

మనసు మాట వింటేనే మనం ఏదైనా సాధించగలం. అలా అంతరాత్మ సందేశాన్ని అనుసరించి.. ఘన విజయం సాధించిన నిజ జీవిత హీరోల కథలతో బాలీవుడ్ నాయిక ట్వింకిల్ ఖన్నా ‘వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బి’ (బుక్ -2) పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఎనిమిదేండ్ల పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికీ తేలికగా అర్థమయ్యేలా.. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారి గాథలకు అక్షర రూపం అందించారు. ఈ పుస్తకంలో 20 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయంలో ఓ నిండైన జీవితం ఉంది. ఆకట్టుకొనే చిత్రాలు అదనపు ఆకర్షణ. ఇందులో సుప్రజా ధారిణి విజయగాథ స్ఫూర్తిదాయకం. తను 18 లక్షల తాబేలు పిల్లలను సురక్షితంగా వాటి ఆవాసాలకు తరలించారు. అనాథ బాలికలను చేరదీసి, ఆశ్రయం ఇచ్చిన కథ.. బీబీ ప్రకాశ్ కౌర్‌ది. కార్లకు స్మార్ట్ సీట్ బెల్ట్ రూపొందించి అనేక ప్రాణాలను కాపాడిన సారంగ్ సుమేశ్ జీవితం అందరికీ ఓ పాఠం. కెరీర్ అంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు మాత్రమే కాదు. ఎదిగేందుకు మరెన్నో అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని పిల్లలకు తెలియజేయడమే ఈ పుస్తక ఉద్దేశమని చెబుతారు ట్వింకిల్ ఖన్నా. ఈ కథల ద్వారా పర్యావరణం, మహిళా హక్కులు, దృఢ సంకల్పం తదితర విషయాలపై పిల్లల్లో అవగాహన కల్పించారు ట్వింకిల్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

