రంగుల కళ.. మల్టీకలర్ ఫ్యాబ్రిక్
కొందరు కొన్ని రంగులనే ఇష్టపడతారు. దుస్తుల ఎంపికలోనూ ఆ వర్ణాలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇక్కడో చిక్కు ఉంది. అందరికీ అన్ని రంగులూ నప్పవు. మనకు నచ్చే రంగు మన ఒంటికి నప్పకపోవచ్చు. కానీ, ఒంటికి నప్పే రంగులతోపాటు ఇష్టమైన రంగులనూ జోడించి అభిరుచికి
కొందరు కొన్ని రంగులనే ఇష్టపడతారు. దుస్తుల ఎంపికలోనూ ఆ వర్ణాలకే ప్రాధాన్యం ఇస్తారు.
కానీ ఇక్కడో చిక్కు ఉంది. అందరికీ అన్ని రంగులూ నప్పవు. మనకు నచ్చే రంగు మన ఒంటికి నప్పకపోవచ్చు. కానీ, ఒంటికి నప్పే రంగులతోపాటు ఇష్టమైన రంగులనూ జోడించి అభిరుచికి తగినట్టు దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. మల్టీకలర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఈ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అలాంటిదే.
నిండుగా రెండు
గ్రీన్ అండ్ లైట్‌గ్రీన్ కాంబినేషన్లో రూపొందించిన ఫ్రాక్ ఇది. హాఫ్ అండ్ హాఫ్ డై చేసిన ఫ్యాబ్రిక్‌తో బాడీ, బాటమ్ పార్ట్స్ డిజైన్ చేశారు. బాడీ పార్ట్‌లో ఫుల్నెక్ ఇచ్చి డబుల్ షేడ్‌లో ఫ్లీట్స్ జతచేశారు. లెఫ్ట్ షోల్డర్ దగ్గర ఫ్లవర్ ప్యాటర్న్ ట్విస్ట్ చేశారు. బాటమ్ పార్ట్‌లో డార్క్ కలర్ బార్డర్ ైస్టెల్లో లైట్ గ్రీన్ హైలైట్ చేసి.. చిన్నచిన్న ఫ్లీట్స్తో గేరా ఇచ్చారు. స్లీవ్‌లెస్ హ్యాండ్స్‌తో ట్రెండీలుక్ వచ్చింది.
ముచ్చటగా మూడు
మూడు రంగుల మేళవింపుగా.. డైబెల్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. పీచ్, బ్లూ, నేవీ బ్లూ కలర్స్‌ను ఏ లైన్ ైస్టెల్లో ఫ్రాక్ పైనుంచి కిందివరకు మూడు భాగాలుగా వచ్చేలా డై చేశారు. పీచ్ కలర్ బాడీ పార్ట్‌లో చిన్నచిన్న ప్రిల్స్తో బోట్ నెట్ ఇచ్చి.. షోల్డర్ దగ్గర డోరీలు జతచేశారు. డోరీలకు జోడించిన కలర్ టస్సల్స్ హైలైట్ అయ్యాయి. ఫ్రాక్ కలర్‌కు విరుద్ధంగా డార్క్ నేవీ బ్లూ ఫ్యాబ్రిక్‌పై గవ్వలతో డిజైన్ చేసిన వెయిస్ట్ బెల్ట్ అదనపు ఆకర్షణ.
మోడల్: కడలి
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- design
- fabric
- Multi color
- new trend
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

