తెర వెనుక అంతులేని వివక్ష
సినీ ప్రపంచం పైకి కనిపించేంత అందంగా ఉండదు. ఇకడ రంగుల వెనుక ఎన్నో వివక్షలు, అసమానతలు దాగుంటాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వెండితెరపై నటీమణులకు ప్రాధాన్యం పెరుగుతున్నా తెర వెనుక మాత్రం ఇంకా పురుషాధిక్యత నడుస్తున్నదనేది పచ్చి నిజమంటారు కొంతమంది హీరోయిన్లు.
సినీ ప్రపంచం పైకి కనిపించేంత అందంగా ఉండదు. ఇకడ రంగుల వెనుక ఎన్నో వివక్షలు, అసమానతలు దాగుంటాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వెండితెరపై నటీమణులకు ప్రాధాన్యం పెరుగుతున్నా తెర వెనుక మాత్రం ఇంకా పురుషాధిక్యత నడుస్తున్నదనేది పచ్చి నిజమంటారు కొంతమంది హీరోయిన్లు. తాజాగా ఇదే విషయంపై కృతి సనన్ ఓపెన్ అయ్యింది. ఒక యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న కృతి సనన్ షూటింగ్ సెట్స్‌లో నటీమణులు, హీరోయిన్లు ఎదురొనే వివక్షను ఉదాహరణలతో చెప్పుకొచ్చింది. ఇంజినీరింగ్ చదివి, మోడలింగ్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనకు బాలీవుడ్లోనే భరించలేనంత ఎకువ సవాళ్లు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకు, హీరోల పకన రొమాన్స్ సీన్లకే పరిమితం చేసేవారని గుర్తుచేసుకుంది. ఇప్పుడు కథల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం లభిస్తున్నా, సెట్స్‌లో చూపే వివక్ష రూపం మారిందే తప్ప పూర్తిగా పోలేదని చెప్పుకొచ్చింది.
షూటింగ్ సమయంలో నటీనటులు తమ పాత్రల గురించి దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రశ్నలు అడగడం సహజం. కానీ, అకడే అసలు వివక్ష మొదలవుతుందని కృతి పేరొన్నది. ఒకే రకమైన ప్రశ్నకు హీరోలకు, హీరోయిన్లకు దకే సమాధానాల్లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందని వివరించింది. ఒక హీరోయిన్ ప్రశ్నలు అడిగితే.. ‘ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నది..’ అని వెనకాల మాట్లాడుకుంటారని, అదే ఒక స్టార్ హీరో ప్రశ్నలు అడిగితే మాత్రం.. ‘సినిమాపై అతనికి చాలా శ్రద్ధ ఉంది. అందుకే ఇన్వాల్వ్ అవుతున్నాడని’ మెచ్చుకుంటారని తన అనుభావాన్ని పంచుకున్నది. తాను ఏదైనా డౌట్ అడిగితే ఎకువగా ఓవర్ ఎనలైజ్ చేయకు అని చెప్పిన చేదు సంఘటనలను గుర్తుకుతెచ్చుకున్నది కృతి సనన్. సినిమా సెట్స్‌లో కార్వాన్లు, రూములు, కార్ల కేటాయింపుల్లోనూ వ్యత్యాసాలు చూపిస్తారని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె హీరోలకు లగ్జరీ వసతులు కల్పించి, హీరోయిన్లను తకువగా చూస్తారని తెలిపింది. తనకు సౌఖర్యాలు ముఖ్యం కాదు కానీ, ఆ వ్యత్యాసం వల్ల కలిగే అవమానం బాధ కలిగిస్తుందని పెదవి విరిచింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

