Lehenga | ఏ గంధర్వకాంతో భువికి వచ్చే దృశ్యాన్ని ఊహించుకున్నప్పుడు.. ఆ నవజవ్వని పట్టుచీరలోనో, చుడీదార్‌లోనో వాలిపోదు. లెహంగాలో దిగొచ్చి హంగామా చేస్తుంది. కాబట్టే, సౌందర్యానికి నిర్వచనంగా మారింది లెహంగా.
డార్క్ వైట్ అండ్ బ్లాక్ మిక్స్డ్ టోన్‌లో గ్రాండ్‌గా కనిపిస్తున్న ఈ లెహంగాను హెవీ శాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. గ్రాండ్‌గా కనిపించడానికి ఆకులు, పూలు గుప్పించి.. పట్టు పోగులతో ఎంబ్రాయిడరీ చేశారు. సంప్రదాయ మార్గంలోనే ఆధునికంగా మెరిసిపోవాలనుకునే వారికి నచ్చే డిజైన్ ఇది.