ఆస్తిలో వాటా వస్తుందా?

మేడమ్ నమస్తే. మా అమ్మానాన్నలకు మేమిద్దరం కూతుళ్లమే. మమ్మల్ని చాలా మమకారంతో పెంచారు, చదివించారు. కానీ, నేనొక అబ్బాయిని ప్రేమించాను. అందుకు, అమ్మానాన్నలు అభ్యంతర పెట్టారు. వాళ్లను ఎదిరించి బయటికి వచ్చేశాను. నాకు నచ్చిన అబ్బాయిని పెండ్లి చేసుకున్నాను. ఆ కోపంతో, అమ్మానాన్నలు నాకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. చట్టపరంగా అది సాధ్యమేనా? ఆస్తిలో నా వాటా పొందడానికి నేనేం చేయాలి? దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
ఓ సోదరి
జ : ఎవరైనా సరే, వీలునామా ద్వారా తమ ఆస్తిని నచ్చిన వారికి ఇవ్వొచ్చు. ఒకవేళ వీలునామా లేకపోతే, చట్టపరంగానే ఆస్తి పంపకాలు జరగాల్సి ఉంటుంది. చట్టప్రకారం, ఒక వ్యక్తి ఆస్తిపాస్తులను పొందడానికి మొదటగా భార్యాపిల్లలే అర్హులు. కాబట్టి, మీ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆస్తిలో సమాన భాగాలు పొందొచ్చు. మీ అమ్మానాన్నలు తమ ఆస్తిని ఇతరులకు చెందాలని వీలునామాలో రాయడం లేదా అమ్మడం లేదా బహుమతిగా ఇవ్వడం జరగకపోతే మాత్రం, ఆ ఆస్తి మీ అక్కాచెల్లెళ్లకు ఆటోమేటిక్‌గా చెందినట్లే. కాకపోతే, ఆస్తిలో ఒక్కొక్కరికి సగభాగం వస్తుంది.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

