కిటికీ ఫ్యాషన్‌గా..!
ఇంటిని అలంకరించేటప్పుడు గోడలు, సోఫా, దీపాలు, అలంకరణ వస్తువులపై ఎంత శ్రద్ధ పెడతామో... కిటికీ దగ్గర మాత్రం దాన్ని అంతలా చూపం. చాలాసార్లు ఏదో ఒక తెర వేసి సరిపెడతాం. కానీ, ఇప్పుడు ఇంటీరియర్ ప్రపంచంలో ఆ ఆలోచన మారుతున్నది. కిటికీ కూడా గదిలోని అలంకరణలో ఒక ముఖ్యమైన భాగమే అంటున్నారు డిజైనర్లు.
ఇంటిని అలంకరించేటప్పుడు గోడలు, సోఫా, దీపాలు, అలంకరణ వస్తువులపై ఎంత శ్రద్ధ పెడతామో… కిటికీ దగ్గర మాత్రం దాన్ని అంతలా చూపం. చాలాసార్లు ఏదో ఒక తెర వేసి సరిపెడతాం. కానీ, ఇప్పుడు ఇంటీరియర్ ప్రపంచంలో ఆ ఆలోచన మారుతున్నది. కిటికీ కూడా గదిలోని అలంకరణలో ఒక ముఖ్యమైన భాగమే అంటున్నారు డిజైనర్లు. అందుకే ఈ ఏడాది కర్టెన్ల విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎకువగా కనిపిస్తున్న మార్పుల్లో ఒకటి రెండు పొరల తెరలు. పగటి వెలుతురు మృదువుగా లోపలికి రావడానికి పలుచని తెర, రాత్రివేళ గోప్యత కోసం మందమైన తెర… ఇలా రెండింటినీ కలిపి అమర్చుతున్నారు. అవసరాన్ని బట్టి ఒకటి తెరిచి, మరొకటి మూసుకోవచ్చు. అందం మాత్రమే కాదు, కావలసినట్టు చాటు ఉంటూ… వెలుతురు మన నియంత్రణలో ఉండేలా.. రకరకాల ప్రయోజనాలు ఉండటంతో ఈ పద్ధతికి ఆదరణ పెరుగుతున్నది.
ఇక వంటగది, డైనింగ్ హాల్ లాంటి చోట్ల కిటికీలో సగం వరకు మాత్రమే వచ్చే చిన్న తెరలు కూడా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఇవి కిటికీ మొత్తాన్ని కప్పకుండా, అవసరమైనంత మాత్రమే మూసి ఉంచుతాయి. అంటే పై భాగం నుంచి వెలుతురు వస్తుంది. మిగతా భాగం కర్టెన్ ఉంటుంది. వీటిని కేఫ్ కర్టెన్లు అని పిలుస్తారు. అయితే పాతకాలపు లేసు, బరువైన అలంకరణలకు బదులుగా ఇప్పుడు సాదాసీదా వస్త్రాలతో, చకటి ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన మార్పు ఏంటంటే, గోడ రంగుకు దగ్గరగా ఉండే కర్టెన్లు. గోడ, తెర వేర్వేరుగా కనిపించకుండా ఒకే రంగులోని వివిధ ఛాయలను ఎంచుకుంటే గది మరింత విశాలంగా కనిపిస్తుంది. అలా అని ఇవన్నీ ఖరీదైనవేం కాదు, కాస్త అభిరుచి ఉంటే… ఎవరైనా అందంగా అలంకరించేయొచ్చు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

