ఇల్లు.. ఓ జ్ఞాపకాల ఆల్బమ్!
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొత్త ఫర్నిచర్, ఖరీదైన అలంకరణ వస్తువులే అవసరమా? అంటే... కాదు, మన జీవితంలో ప్రత్యేకమైన అనుభూతులను మిగిల్చిన వస్తువులతోనూ ఇంటిని అందంగా మార్చుకోవచ్చు అంటున్నారు నేటితరం డిజైనర్లు.
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొత్త ఫర్నిచర్, ఖరీదైన అలంకరణ వస్తువులే అవసరమా? అంటే… కాదు, మన జీవితంలో ప్రత్యేకమైన అనుభూతులను మిగిల్చిన వస్తువులతోనూ ఇంటిని అందంగా మార్చుకోవచ్చు అంటున్నారు నేటితరం డిజైనర్లు. ఇంటీరియర్ అలంకరణలో ‘కలెక్టెడ్ ఓవర్ టైమ్’ అనే ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ఒకేసారి అన్ని వస్తువులూ కొనకుండా, కాలక్రమంలో మనకు నచ్చిన వాటిని సేకరించి అలంకరించుకోవడం దీని ప్రత్యేకత.
ఇది ఇంటికి సహజమైన రూపాన్నివ్వడమే కాకుండా, అందులో ఉండేవారి అభిరుచిని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రయాణంలో సేకరించిన బొమ్మలు, అమ్మమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె, పాతకాలపు గడియారం, ఇష్టమైన పుస్తకాలు.. ఇలా ఒక్కో వస్తువుకూ ఓ కథ ఉంటే ఆ ఇల్లు మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. హాల్లో ఓ చిన్న అరలోనో, లివింగ్ రూమ్ గోడమీదో నచ్చిన చోట వీటిని అలంకరించవచ్చు.
అయితే వస్తువులన్నింటినీ కిక్కిరిసేలా పెట్టకుండా, ఒక్కోదానికి ప్రత్యేకంగా కనిపించేంత ఖాళీ ఉంచాలి. రంగులు, ఆకారాల్లోనూ కొంత సమన్వయం ఉంటే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ పద్ధతిలో ఖరీదైన వస్తువులకంటే వాటితో ముడిపడిన అనుభూతులకే ప్రాధాన్యం. అందుకే ఇప్పుడు పాత వస్తువులనూ కొత్త అలంకరణలో భాగం చేసుకోవచ్చు. జ్ఞాపకాలతో నిండిన ఇల్లు మనసును తాకుతుంది అనడంలో సందేహం ఏముంది?!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

