సాంత్వన కోసం చాలామంది సంగీతాన్ని ఆశ్రయిస్తారు. సంగీతానికి ఏకాగ్రతను మెరుగుపరిచే సామర్థ్యమూ ఉందని తాజా అధ్యయన సారాంశం. మంచి సంగీతం పనిపై ఏకాగ్రత కుదిరేలా చేస్తుందట. అలా, ఆలోచనలు పక్కదారి పట్టడం తక్కువైపోయి, లక్ష్యం మీదే గురిపెడతాం. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాటిని మస్తిష్కంలో పదిలపరుచుకోవడానికి సంగీతం ఉపకరిస్తుందని కనెక్టికట్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయంలో శాస్త్రీయ సంగీతం ముందు వరుసలో ఉంటుందనీ స్పష్టంచేసింది.