గాలిపంకా వంక చూడండి
ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలూ బాగుంటాయి. ఈ విషయంలో చాలామంది తీవ్రంగా కృషి చేస్తుంటారు. పక్షం రోజులకు ఒకసారైనా... గోడలు, వార్డ్రోబ్లు, మంచాలు అన్నీ శుభ్రం చేస్తుంటారు. కిటికీ అద్దాలు కూడా మెరిసిపోయేలా తుడుస్తారు.
ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలూ బాగుంటాయి. ఈ విషయంలో చాలామంది తీవ్రంగా కృషి చేస్తుంటారు. పక్షం రోజులకు ఒకసారైనా… గోడలు, వార్డ్రోబ్లు, మంచాలు అన్నీ శుభ్రం చేస్తుంటారు. కిటికీ అద్దాలు కూడా మెరిసిపోయేలా తుడుస్తారు. కానీ, సీలింగ్ ఫ్యాన్‌కు పేరుకుపోయిన దుమ్మును మాత్రం అంతగా పట్టించుకోరు.
చేతికి అందనంత ఎత్తులో ఉండటం, దానిని క్లీన్ చేస్తే.. ఫ్లోర్ పాడవుతుందన్న బెంగ కారణంగా గాలిపంకా వంక కన్నెత్తి చూడటానికి కూడా సాహసించరు. అయితే వారాలు, నెలల తరబడి ఫ్యాన్‌ను శుభ్రం చేయకపోతే దాని మన్నిక కూడా తగ్గుతుంది. పంకా రెక్కలు దుమ్ము కొట్టుకుపోయి అసహ్యంగా కనిపిస్తాయి. ఫ్యాన్ వేసినప్పుడు బూజు ఫ్లోర్ మీదో, మీ నెత్తినో పడి చికాకు పెట్టొచ్చు. అలా కావొద్దంటే.. నెలకు ఒకసారైనా సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయండి.
- డస్టర్ గానీ, పాత సాక్సులతో గానీ రెక్కలను శుభ్రం చేయొచ్చు. రెక్కల దుమ్ము కింద పడకూడదు అనుకుంటే.. వాటికి పాత పిల్లో కవర్స్ తొడిగి.. నెమ్మదిగా తుడిస్తే చాలు. ఏకకాలంలో రెండు పక్కలా క్లీన్ అవుతుంది. దుమ్ము కూడా పిల్లో కవర్ లోపలే
పడిపోతుంది. - ఫ్యాన్ రెక్కలకు మురికి బాగా ఉందనిపిస్తే.. వెనిగర్, బేకింగ్ సోడా మిక్స్ చేసిన పేస్ట్‌ను రెక్కలకు రాయాలి. 10 నిమిషాలు వదిలేసి.. తర్వాత కాటన్ వస్ర్తాన్ని నీటిలో ముంచి శుభ్రం చేయాలి.
- అరగ్లాసు నీటిలో షాంపూ, కాస్త ఆవ నూనె వేసి బాగా కలపాలి. ఆ ద్రావణాన్ని స్పాంజ్ లేదా మెత్తటి వస్త్రంతో అద్ది రెక్కలను తుడిస్తే తళతళా మెరిసిపోతాయి.
- మీ ఫ్యాన్ కొత్తదానిలా మెరవాలంటే.. ముందుగా రెక్కలను దుమ్ము లేకుండా తుడవాలి. కాటన్ వస్త్రంపై ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి.. దాంతో శుభ్రం చేయాలి. అప్పుడు మీ సీలింగ్ ఫ్యాన్ రెక్కలు కొత్త మెరుపు తొడుగుతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

