పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రచయిత చిన్నికృష్ణ క్షమాపణలు చెప్పారు. గురువారం ఉదయం ఆయన చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో తాను చిరంజీవిపైన కొందరి ప్రభావం వల్ల తప్పుగా మాట్లాడానని చిన్నికృష్ణ చెప్పారు. ఇలా మాట్లాడినందుకు తాను ఎంతగానో కుమిలిపోయానని పేర్కొన్నారు.