బాలల రక్షణ కోసం ఏం చేస్తున్నారు?
- కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బాలల హక్కుల రక్షణ కోసం కేంద్రం తీసుకొంటున్న చర్యలేమిటని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బాలసదనాల్లోని చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని, సంరక్షించాల్సిన సిబ్బందే వారిపట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్తూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటికి లోబడి చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఎన్సీపీసీఆర్ (ది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) జేజేయాక్ట్ (జువైనల్ జస్టిస్ యాక్ట్)లను అనుసరించి చర్యలు తీసుకొంటామని చెప్పారు.
రాష్ట్రంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల సంగతేమిటి?: ఎంపీ బీబీ పాటిల్
రాష్ట్రంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాల పరిస్థితి ఏమిటని కేంద్రాన్ని ఎంపీ బీబీ పాటిల్ ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్తూ.. రాష్ట్రంలో 9 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 6 పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

