వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్యత, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభకు శుక్రవారం కురవిలో శ్రీకారం చుట్టారు.
కురవి, అక్టోబర్ 30: ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్యత, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభకు శుక్రవారం కురవిలో శ్రీకారం చుట్టారు. ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ డీఈ ఆధ్వర్యంలో కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభ విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించి మొక్కులు సమర్పించారు. అనంతరం ఆధార్ సొసైటీ, తుడుందెబ్బ, కుమ్రం భీమ్ యూత్ ఫర్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆదివాసీ సమాజంలోని తొమ్మిది తెగలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటడంతో పాటు, తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడమే సభ ప్రధాన ఉద్దేశమన్నారు. ఆదివాసీల సామాజిక అస్తిత్వం, స్వాభిమానం, హక్కులు, భూమి, అటవీ వనరుల పరిరక్షణ కోసం సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీ యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు భావితరాలకు తమ మూలాలు, వారసత్వంపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 9న మానుకోటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణ పెద్దలు, ఆధార్ సొసైటీ ఉపాధ్యక్షుడు మూతి భాస్కర్ రావు, కురసం సీతారాములు, ఏఈడబ్ల్యూసీఏ నాయకులు జెజ్జరి జానకీరామ్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు అలెం కోటి, జిల్లా నాయకులు ఉండం శ్రీను, కల్తి నర్సయ్య, ఎట్టి కిరణ్ పాల్గొన్నారు. బయ్యారం మండల నాయకులు, కుల పెద్దలు చాట్ల వెంకన్న, మెస్సు రాజశేఖర్, చుంచు ముత్తయ్య, రాజు, బట్ట శ్రీకాంత్, అరుణ్, వజ్జా రవితేజ, ఇల్లందు మండల నాయకులు ముక్తి కోటేశ్వరరావు, జబ్బ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
Ayesha Khan | ఎర్ర చీరలో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్.. అందమైన ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

