TG Tenth Results | రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 15వ తేదీ వరకు అవకాశం
TG Tenth Results | తెలంగాణ పది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు.
TG Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు చివరి తేదీ మే 15. తదితర వివరాల కోసం సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్ను సంప్రదించొచ్చు.
పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఫీజులు చెల్లించేందుకు చివరి తేదీ మే 16.
పదో తరగతి ఫలితాల్లో బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ ఏడాది 4,629 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండు పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఫలితాలు పొందాయి. మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్, జడ్పీ, గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం 92.78 కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.
సీజీపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

