అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించడంతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి ఎదుట ధర్నా నిర్వహించారు.
- కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్‌బజార్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించడంతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసిన ప్రతినిధులు.. రిక్రూట్మెంట్కు ముందు తమకు ఉద్యోగభద్రత కల్పించాలని, తొలగించమని లిఖితపూర్వక హామీనివ్వాలని, యూజీసీ పేస్కేల్స్ అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు.
యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్పై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఏడు వర్సిటీల వీసీలతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి వర్సిటీల రిజిస్ట్రార్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో భేటీ అయ్యారు. రిక్రూట్మెంట్ విధివిధానాలపై చర్చలు జరిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

