పాఠశాల గంట మోగుతుంది గణగణగణ

- విద్యార్థులంతా బడికి రావాలి
- బుల్లెట్ బండి ైస్టెల్లో పాట
- టీచర్ సుధాకర్‌రావు వీడియో వైరల్
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 5: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తప్పా’ అనే పాటకు ఇటీవల వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదే పాట తరహాలో ఓ ఉపాధ్యాయుడి పాట కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నది. కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలు 16 నెలల తరువాత ఈ నెల ఒకటిన ప్రారంభమయ్యాయి. కరోనా భయాలు ఇంకా వీడకపోవడం.. విద్యార్థులు పాఠశాలకు వస్తారో రారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో విద్యార్థుల్లో కరోనా భయాన్ని పోగొట్టి, జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలకు రావాలంటూ వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండిత్ సుధాకర్‌రావు స్వయంగా పాటను పాడారు. దీన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. ‘పాఠశాల గంట మోగుతుంది గణగణగణ, పిల్లలు అందరు వచ్చేయండి చకచకచక’ అంటూ ఈ పాటను బుల్లెట్ బండి సాంగ్ తరహాలో పాడారు. ఇంకా ఈ పాటలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా బడికి రావాలని సుధాకర్‌రావు సూచించారు. పిల్లల్లో కరోనా భయాన్ని పోగొట్టేందుకే ఈ పాటను రాసి పాడినట్టు సుధాకర్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

