హైదరాబాద్ జనవరి 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ ఏడీజీగా స్వాతిలక్రా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అన్నారు. ఇదివరకు ఉమెన్ సేఫ్టీవింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆమె సమర్థవంతంగా షీటీమ్స్ నిర్వహించారు. షీటీమ్స్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, ఆ విభాగానికి గుర్తింపు తీసుకొచ్చారు. షీటీమ్స్ సిబ్బ ంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.