జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
శంకర్‌కు రక్తపోటు అధికంగా ఉండటంతో బీపీ తగ్గిన తరువాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు వచ్చిన అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. బీఎన్ఎస్లోని 126(2), 115(2), 351(2), 329, 324,352, 3(5) సెక్షన్లతో పాటు కొత్తగా నాన్‌బెయిలబుల్ సెక్షన్ 119 (1)ని జతచేశారు.
- గురువారం అరెస్టుచేసినా శుక్రవారం కోర్టు ముందు హాజరు
- మెడికవర్ దవాఖాన యాజమాన్యాన్ని బెదిరించినందుకే అరెస్టు: సీఐ
మారేడ్‌పల్లి, అక్టోబర్ 23 : న్యూస్‌లైన్ చానల్ ఎండీ, జర్నలిస్టు శంకర్‌గౌడ్‌కు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం, నిరసనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన నేపథ్యంలో హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు గురువారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకొని నేరుగా గాంధీ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. శంకర్‌కు రక్తపోటు అధికంగా ఉండటంతో బీపీ తగ్గిన తరువాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు వచ్చిన అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. బీఎన్ఎస్లోని 126(2), 115(2), 351(2), 329, 324,352, 3(5) సెక్షన్లతో పాటు కొత్తగా నాన్‌బెయిలబుల్ సెక్షన్ 119 (1)ని జతచేశారు. దినమంతా వృథా చేసిన పోలీసులు సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో శంకర్‌గౌడ్‌ను కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే జడ్జి వెళ్లిపోవడంతో గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది ప్రభుత్వ కుట్ర: శంకర్
సికింద్రాబాద్ కోర్టులో శుక్రవారం ఉదయం శంకర్‌ను పోలీసులు హాజరుపరుచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు ఆవరణలో శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ కుట్ర అని, రేవంత్‌రెడ్డి ప్రమేయంతోనే పోలీసులు తనను అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని ఈ సందర్భగా పలువురు జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దవాఖాన యాజమాన్యాన్ని బెదిరించినందుకే అరెస్టు : సీఐ
సికింద్రాబాద్ మెడికవర్ దవాఖాన యాజమాన్యాన్ని డబ్బుల కోసం బెదిరించడంతోపాటు దవాఖాన కార్యకలాపాలకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై శంకర్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్టు గోపాలపురం ఇన్స్పెక్టర్ మధుకుమార్ తెలిపారు. దవాఖానను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోపాటు తన యూట్యూబ్ చానల్ సిబ్బంది, ఇతరులతో కలిసి దవాఖాన ప్రాంగణంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించి ఇబ్బందులు సృష్టించాడని అన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన దవాఖాన సిబ్బందిపై దాడికి పాల్పడి, వారి విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు. శంకర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

