గొప్ప దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్

సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ సిధారెడ్డి
సార్ స్మారక కవితా సంకలనం ఆవిష్కరణ
కవాడిగూడ, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సిద్ధాంతకర్తగా నాయకత్వానికి చక్కని మార్గనిర్దేశనం చేసిన గొప్ప దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల గుండెలోతుల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చగలిగారని ప్రశంసించారు. తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్యసాధన ఫౌం డేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక కవితా సంకలనాన్ని’ ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, పలువురు కవులు, రచయితలతో కలిసి సిధారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలను సిధారెడ్డి శాలువాలతో సత్కరించారు. తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ అధ్యక్షతన జరిగిన సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్‌గౌడ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, నేటి నిజం పత్రిక సంపాదకుడు బైసా దేవదాస్, ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ చైర్మన్ అశోక్‌యాదవ్, తెలుగు భాషా చైతన్య సమితి ముఖ్య సలహాదారు ఆళ్ల రామకృష్ణ, హైకోర్టు న్యాయవాది కొంకల జంగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

