Pegadapally youth | పెగడపల్లి యువకుడికి రూ.1.50 కోట్ల వార్షిక వేతనం..అమెరికాలో ఉద్యోగం
Pegadapally youth | జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన పొట్లపల్లి ఆదిత్య రూ.1.50 కోట్ల వార్షిక వేతనం(Annual salary)తో అమెరికాలో ఉద్యోగం సాధించాడు.
పెగడపల్లి (జగిత్యాల ) : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన పొట్లపల్లి ఆదిత్య రూ.1.50 కోట్ల వార్షిక వేతనం(Annual salary)తో అమెరికాలో ఉద్యోగం సాధించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పొట్లపల్లి అరుణ – సత్యనారాయణరావు చిన్న కుమారుడు ఆదిత్య బీటెక్ పూర్తి చేసి నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ స్టార్టప్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇదే అనుభవంతో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ అమెరికాలోని కొలరొడో(Colorado)లో ఉన్న ప్రముఖ వైద్య పరికరాల కంపెనీ(Medical device company) మెడ్ట్రానిక్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు. ఈ కంపెనీ ఆదిత్యకు సంవత్సరానికి రూ.1.50 కోట్ల జీతంతో ఉద్యోగ అవకాశం కల్పించింది. అమెరికా జాబ్ మార్కెటింగ్‌లో 65 శాతం తిరోగమనం ఉన్నప్పటికీ ఆదిత్య తన ప్రతిభతో అక్కడ ఉద్యోగం సాధించడం పట్ల ప్రస్తుతం జగిత్యాల విద్యానగర్‌లో నివాసం ఉంటున్న ఆదిత్య కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వాసి ఆదిత్య మంచి ప్యాకేజీతో అమెరికాలో ఉద్యోగం సాధించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula), జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు యువకుడికి కృతజ్ఙతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

