హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ ప్రత్యేక సేవల డ్రైవ్ 28న కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాస్పోర్ట్ వెబ్సైట్ www.passport.gov.in లో అపాయింట్మెంట్స్ విడుదల చేస్తామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే, ఇది వరకే దరఖాస్తు చేసుకొని ఉన్నవారికి రీషెడ్యూల్ అవకాశం ఉందని వివరించారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆ రోజున సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సోమవారం పాస్పోర్ట్ కార్యాలయాలకు సెలవు లేదని చెప్పారు. ఎప్పటి లాగే ముందు నిర్ణయించినట్టుగా మంగళవారం దసరా సెలవు ఉంటుందని అన్నారు. దరఖాస్తుదారులు గమనించగలరని కోరారు.