యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ : యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ ‘నీట్’ ఆయూష్ కటాఫ్ స్కోర్ ను 5% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీ 45వ పర్సెంటైల్, దివ్యాంగులు (జనరల్)కు 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 35 పర్సెంటైల్గ నిర్ణయించారు.
కటాఫ్ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ కన్వీనర్ కోటా అలాగే బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటాలలో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి ప్రవేశ ప్రకటనలను జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్, యాజమాన్య కోటాలకు విడివిడిగ దరఖాస్తు చేసుకోవాలిసి ఉంటుంది.
తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 2న ఉదయం 8 గంటల నుంచి 3న మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

