Minister Seethakka | ములుగు జిల్లాలో రాళ్లవాగును పరిశీలించిన మంత్రి సీతక్క
Minister Seethakka | ములుగు జిల్లాలో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ప్రవాహానికి బండారు పల్లి వద్ద రహదారి కొట్టుకు పోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలసి పరిశీలించారు.
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్‌లు జలకళలను సంతరించుకుంటున్నాయి. వరద నీటి తీవ్రతకు పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కాగా, ములుగు జిల్లాలో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ప్రవాహానికి బండారు పల్లి వద్ద రహదారి కొట్టుకు పోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలసి పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనేం దుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఆర్ అండ్ బీ డీఈ. రఘువీర్, తహసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

