Home
Telangana
Manda Krishna Madiga Demands Cancellation Of Land Allocation For Hyderabad Unity Mall
లిడ్ క్యాప్ భూములను కాపాడాలి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (రాయదుర్గం)లో యూనిటీ మాల్ నిర్మాణం కోసం కేటాయించిన ఆరున్నర ఎకరాలతోపాటు పెట్రోల్ బంక్, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఇచ్చిన మరో మూడున్నర ఎకరాల లిడ్ క్యాప్ భూముల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
- యూనిటీ మాల్‌కు కేటాయింపులను రద్దు చేయాలి
- ఎమ్మెల్యే కవ్వంపల్లికి మంద కృష్ణ మాదిగ వినతి
శంకరపట్నం, నవంబర్ 16 : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (రాయదుర్గం)లో యూనిటీ మాల్ నిర్మాణం కోసం కేటాయించిన ఆరున్నర ఎకరాలతోపాటు పెట్రోల్ బంక్, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఇచ్చిన మరో మూడున్నర ఎకరాల లిడ్ క్యాప్ భూముల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీకాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దళిత వ్యాపారులకు తగిన అవకాశాలు కల్పించని యూనిటీ మాల్‌కు దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన అత్యంత విలువైన లిడ్ క్యాప్ భూములను కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

