కొల్లాపూర్, నవంబర్ 21: ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన ఢిల్లీ పెద్ద లను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొల్లాపూర్ నియోజకరవర్గ అభివృద్ధి,సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమేనన్నారు. బీజేపీ కుట్రలను భగ్నం చేసి తొలిసారిగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రానికి సోమవారం వచ్చారు. ఆయనకు గులాబీ శ్రేణులు నాగర్‌కర్నూల్ చౌరస్తా నుంచి కొల్లాపూర్ వరకు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చిన ఘనత ఢిల్లీపెద్దలకే దక్కిందని ఎద్దేవా చేశారు.