తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
తల్లిన వదిలేసిన కొడుకులు | నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ తల్లి వారికి భారమైంది. ముదిమి వయసులో వారి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకులు కర్కషంగా తల్లిని గాలికొదిలేశారు.

వరంగల్ అర్బన్ : నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ తల్లి వారికి భారమైంది. ముదిమి వయసులో వారి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకులు కర్కషంగా తల్లిని గాలికొదిలేశారు. పని చేసే ఓపిక లేక ఆ తల్లి ఆకలితో అలమటించింది. ఇక చేసేది లేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. వారి దీనగాథను విన్న ఎస్ఐ మానవీయంగా స్పందించారు. కడుపు నిండా తిండి పెట్టి న్యాయం చేస్తానని హామీనిచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన మేకల పోచమ్మ (70) తన భర్త సంవత్సరన్నర క్రితం చనిపోయాడు. కాగా, పోచమ్మకు ఇద్దరు కొడుకులు మేకల రాజయ్య, మేకల సదయ్య, కూతరు గట్టమ్మ ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి బాగోగులు చూసుకోవడం లేదు. కనీసం తిండి కూడా పెట్టకుండా తల్లిని వదిలేశారు.
దీంతో పోచమ్మ తన మీదే ఆధారపడి ఉన్న ఇంకా పెండ్లి కాని తన కూతురు మేకల గట్టమ్మ (45) ఇద్దరు కలిసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కాగా, కమలాపూర్ ఇన్స్పెక్టర్ పి. కిషన్ వారి బాధ తెలుసుకొని చలించిపోయారు. ఆకలితో ఉన్న వారిద్దరికి భోజనం పెట్టి ఆకలి తీర్చారు. మానవీయంగా స్పందించి ఆదరించిన ఎస్ఐని పలువురు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

