నీటి చెలిమల కోసం వెతికేకాలంలోనే నిండుకుండలా చెరువులు.. వానకాలం రాకముందే పొంగిన వాగులు.. బావురుమన్న స్థితి నుంచి ఊటపారుతున్న బావులు.. మెలికలు తిరుగుతూ పారుతున్న కాలువలు.. సాగు భూములుగా మారిన బీళ్లు.. పండుతున్న సిరులు.. రైతుల మోముల్లో చిరునవ్వులు.. దశాబ్దాల క్రితం వలసవెళ్లినవారు సంబురంగా సొంతూళ్లకు తిరిగి వస్తున్న సందర్భాలు.. ఇదికదా బంగారు తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం. భూదేవికి చిలకపచ్చ చీరకట్టినట్టు.. వరిపైరుకు పురుడుపోస్తున్నట్టు.. ఈ చిత్రం జనగామ మండ లం చీటకోడూరు రిజర్వాయర్ కింద దేవాదుల (గోదావరి) నీటితో సాగవుతున్న పంట పొలాలది.
ఫోటో: స్వర్గం చంద్రశేఖర్, నమస్తే తెలంగాణ,జనగామ.