హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుర్మాచలం అనిల్ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అండగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్లో పెద్దపీట వేయడం సంతోషకరమన్నారు. దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు.