పోలీస్ బలగాలతో వచ్చి భూసర్వే చేస్తరా?
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భా గంగా కాలువల నిర్మాణానికి వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్లలో భూ సర్వే చేయడంపై స్థానిక రైతులు భగ్గుమన్నారు. పోలీస్ బలగాలతో వచ్చి భూ సర్వే చేస్తరా?.. సీఎం ఇలాకాలోనే ఇంతటి దౌర్జన్యమా? అని ప్రశ్నించారు. కాలువల నిర్మాణం ఎవరి స్వలాభం కోసమని..
- ఈ బలవంతపు సర్వే ఏమిటి?
- సీఎం రేవంత్ ఇలాకాలోనే ఇంతటి దౌర్జన్యానికి దిగుతారా?
- సర్వేకు వచ్చిన అధికారులకు ఎదురు తిరిగిన రైతులు
- భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిన చెప్పిన అన్నదాతలు
కొడంగల్, అక్టోబర్ 12 : కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భా గంగా కాలువల నిర్మాణానికి వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్లలో భూ సర్వే చేయడంపై స్థానిక రైతులు భగ్గుమన్నారు. పోలీస్ బలగాలతో వచ్చి భూ సర్వే చేస్తరా?.. సీఎం ఇలాకాలోనే ఇంతటి దౌర్జన్యమా? అని ప్రశ్నించారు. కాలువల నిర్మాణం ఎవరి స్వలాభం కోసమని.. తమకు ఉపయోగం లేని ఈ పథకం ఎందుకని రైతులు నిలదీశారు. ఈ ఎత్తిపోతలకు తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వివరాలు ఇలా.. సోమవారం ఏర్పుమల్ల గ్రామ పొలాల్లో అధికారులు కాలువల నిర్మాణానికి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు అక్కడికి వెళ్లి సర్వే పనులను అడ్డుకొన్నారు. తమ భూముల్లో సర్వే చేపట్టవద్దని గతంలోనే తీర్మానం చేసి ఆ ప్రతిని అధికారులకు అందించినప్పటికీ తాజాగా సర్వే చేపట్టడం ఏంటని మండిపడ్డారు.
‘కాలువలు వద్దు.. నీళ్లు వద్దు.. మాకు మా భూములే ముఖ్యం’ అంటూ సర్వే ప్రక్రియను అడ్డుకొన్నారు. స్థానికంగా నిర్మించే కాలువల ప్రాంతంలో 5 చెరువులు, కుంటలు ఉన్నాయని, వాటిని అనుసంధానం చేయకుండా నేరుగా బొంరాస్‌పేట చెరువుకు నీరందించేలా డిజైన్ ఎలా రూపొందిస్తారని మండిపడ్డారు. పోలీసు బలగాన్ని మోహరించి రై తుల నోరు నొక్కేస్తున్నదని విమర్శించారు. సర్కార్ బలవంతపు భూసేకరణ చేపడితే తమకు చావే శరణ్యమని పేర్కొన్నారు. తహసీల్దార్ పద్మావతి మాట్లాడుతూ.. ప్ర భుత్వ సూచనల మేరకు భూ సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. అభ్యంతరాలపై ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

