పెద్దపల్లి సీఐని సస్పెండ్ చేయాల్సిందే
దళిత యువకులపై దాడి సరికాదు .. పెద్దపల్లిలో దళిత సంఘాల నాయకుల ధర్నా.
పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 25: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దళిత యువకులు కుమ్మరి నవీన్, మోదంపల్లి ప్రణయ్, కుమ్మరి శ్రీశైలంపై దాడిచేసిన పెద్దపల్లి సీఐని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి నవీన్‌తోపాటు నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 22న గ్రామంలో ఆడెపు వెంకటేశం వర్గీయులు, కుమ్మరి నవీన్ మధ్య గొడవ కాగా, ఇరువర్గాలు పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏసీపీ ఇరువర్గాలతో రాజీచేశారని పేర్కొన్నారు.
ఈ నెల 24న కుమ్మరి నవీన్, మోదంపల్లి ప్రణయ్, కుమ్మరి శ్రీశైలంను పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సీఐ ఉద్దేశపూర్వకంగా లాఠీతో దాడిచేశారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం ప్రోద్బలంతోనే సీఐ కొట్టారని తెలిపారు. ఆడెపు వెంకటేశంతో పాటు పెద్దపల్లి సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పెద్దపల్లి డీసీపీకి వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

