దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా అవంతిక
తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపునకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.
ముంబై, ఏప్రిల్ 9: తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపునకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. ‘మీన్ గర్ల్స్’ సినిమాలో తన నటనతో అలరించిన ఆమె నట ప్రస్థానం ఇప్పుడే మొదలైందని కితాబిచ్చింది. తన అద్భుత నటనా ప్రదర్శనతో అంతర్జాతీయ, భారతీయ వినోద పరిశ్రమలపై ఆమె చెప్పకోదగ్గ ప్రభావాన్ని చూపిందని కొనియాడింది. తనకు హార్వర్డ్ పురస్కారం లభించడంపై అవంతిక హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి ఈ గౌరవాన్ని పొందడం నిజంగా నమ్మశక్యం కాని ప్రేరణ కలిగిస్తున్నది. ఇది నా ప్రయత్నాన్ని గుర్తించడమే కాదు, దేశాల హద్దులు దాటిన కథనాల ప్రాముఖ్యతను, ప్రపంచ మీడియాలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తున్నది’ అని ఆమె తెలిపారు. ఇండియన్ ఓటీటీ ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ అవంతికకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఆమె పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. బాల నటిగా పలు తెలుగు సినిమాల్లో నటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

