Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు అద్భుతమైన కళాప్రతిభను చాటుకున్నారు.
హనుమకొండ చౌరస్తా : హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో ( Cultural Competitions) హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(అటానమస్) అధ్యాపకులు ( Pingili College Facultys ) అద్భుతమైన కళాప్రతిభను చాటుకున్నారు. జానపద బృంద నృత్యం, సోలో గానం విభాగాల్లో ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
కళాశాలకు చెందిన అధ్యాపకులు సువర్ణ, సుభాషిణి, జ్యోతి, పద్మ, పి.అరుణ, రేణుక, మాధవి, కల్పన జానపద బృంద నృత్యాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ, సమన్వయం, లయబద్ధత, నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ, జానపద కళా వైభవం వారి ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సోలో సింగింగ్ పోటీల్లో పీడీ సుజాత, సామ్యూల్, ప్రవీణ్‌కుమార్ మధురమైన గాత్రంతో సంగీతాభిమానులను అలరించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, కల్చరల్ కోఆర్డినేటర్ ఆర్.లక్ష్మీకాంతం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

