జాదూవాలా.. మేకప్!
మేకప్ వేసుకుంటే ఇంకొంత అందంగా కనిపిస్తామనే ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ ఒక వ్యక్తిని మరో వ్యక్తిలా చూపించే మేకప్ గురించి ఎక్కడా విని ఉండరు. మేకప్ వేయగానే ఆడవాళ్లు మగవాళ్లలా... మగవాళ్లు ఆడపిల్లల్లా... చటుక్కున మారిపోతారు. ‘ట్రాన్స్ఫర్మేషన్ మేకప్'.. ఇలాంటి అద్భుతాలు చాలానే చేస్తుంది. ఆ జంతర్ మంతర్ మేకప్ సంగతులేమిటో చూద్దాం!
మేకప్ వేసుకుంటే ఇంకొంత అందంగా కనిపిస్తామనే ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ ఒక వ్యక్తిని మరో వ్యక్తిలా చూపించే మేకప్ గురించి ఎక్కడా విని ఉండరు. మేకప్ వేయగానే ఆడవాళ్లు మగవాళ్లలా… మగవాళ్లు ఆడపిల్లల్లా… చటుక్కున మారిపోతారు. ‘ట్రాన్స్ఫర్మేషన్ మేకప్’.. ఇలాంటి అద్భుతాలు చాలానే చేస్తుంది. ఆ జంతర్ మంతర్ మేకప్ సంగతులేమిటో చూద్దాం!
చర్మంపై వివిధ పొరల్ని అతికించే ‘ప్రోస్తటిక్ మేకప్’ గురించి మనకు తెలిసిందే. కానీ కొన్ని బ్రష్‌లు, రంగురంగుల పౌడర్లు, కొన్ని రంగుల సాయంతో ఒక మనిషిని మరో మనిషిని పోలినట్టు తీర్చిదిద్దడం ‘ట్రాన్స్ఫర్మేషన్ మేకప్’ ప్రత్యేకత. కొంతకాలంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సోషల్ మీడియా వీడియో వేదికల మీద ఈ చిత్రమైన మేకప్‌లు వేసుకుని ఇంటర్నెట్ స్టార్లుగా మారినవారూ ఉన్నారు. అందులో ఢిల్లీకి చెందిన దీక్షితా జిందాల్ ఒకరు. ఈమె ‘సెలెబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్’ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో దీక్షిత బాలీవుడ్ నటీమణులు రేఖ, కాజోల్లాంటి వాళ్లతో పాటు షారుక్‌ఖాన్, మైఖేల్ జాక్సన్ తదితరుల్లా తన రూపురేఖల్ని తీర్చిదిద్దుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కరోనా మహమ్మారి సమయంలో కాలక్షేపానికి మేకప్ వీడియోలు చూస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందని చెబుతారు దీక్షిత. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన అలెక్సిస్ స్టోన్ అనే మేకప్ ఆర్టిస్ట్ అప్లోడ్ చేసిన జంతర్ మంతర్ మేకప్ వీడియోలు తనకు స్ఫూర్తినిచ్చాయని అంటారు. పురుషుడైన అలెక్స్ తననుతాను క్వీన్ ఎలిజబెత్, బ్రాడ్‌పిట్ తదితర ప్రముఖుల్లా తీర్చిదిద్దుకున్న వీడియోలు లక్షల్లో వ్యూస్, లైక్స్ సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. అలాగే టిక్‌టాక్ వేదికగా చైనాకు చెందిన వ్లాగర్ హి యుహాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ మేకప్‌తో మోనాలిసా, లేడీ విత్ పెర్ల్ ఇయర్ రింగ్‌లాంటి పాత పెయింటింగుల్లోని అమ్మాయిల్లా మారిపోయిన తీరు నెటిజన్లను మంత్ర ముగ్ధుల్ని చేసింది. మీరు కూడా ఇలాంటి జంతర్ మంతర్ మేకప్ వీడియోలు చూడాలనుకుంటే నెట్టింట్లో వెతికేయండి మరి!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

