Hora timings | హోరా సమయాల్లో ఆచరించే కార్యక్రమాలు
Hora timings | ప్రతిరోజూ సూర్యోదయంతో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహ హోర ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రవి హోరతో మొదలవుతుంది. సోమవారం చంద్ర హోరతో మొదలవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడి హోరలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. రవి, కుజ, శని హోరలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి.
Hora timings | ప్రతిరోజూ సూర్యోదయంతో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహ హోర ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రవి హోరతో మొదలవుతుంది. సోమవారం చంద్ర హోరతో మొదలవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడి హోరలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. రవి, కుజ, శని హోరలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి.
రవి హోర: అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయవిక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం.
శుక్ర హోర: శుభకార్యాలు, వాహన కొనుగోళ్లు, సంగీతం-నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు, పెండ్లిచూపులు తదితర పనులకు అనుకూలం.
బుధ హోర: వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్వాలకు బుధ హోరా అనుకూలమైనది.
చంద్ర హోర: భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్ర హోరా అనుకూలం.
శని హోర: శుభకార్యాలకు శని హోరా అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్రపరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శని హోరా అనుకూలం.
గురు హోర: ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాషాధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్ర్తాభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురు హోరా అనుకూలం.
కుజ హోర: కొన్ని విషయాలకు మాత్రమే కుజ హోరా అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రికల్, పోలీసులను సంప్రదించడం, భూ సేకరణ, గృహ నిర్మాణ భూకొలతలు, శస్త్ర చికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజ హోరా అనుకూలం.
బుధ, గురు, శుక్ర హోరలు శుభప్రదం. శుద్ధ పంచమి నుంచి బహుళ దశమి వరకు చంద్ర హోర యోగిస్తుంది. ప్రయాణ సమయాల్లో హోర పాటించడం మంచిది. ప్రతి పనుల్లోనూ హోర కాలాన్ని తప్పకుండా పాటించాలన్న నియమం లేదు. శుభ హోర సమయంలో దుర్ముహూర్తం, వర్జ్యం ఉన్నా సమస్యలు ఎదురుకావని శాస్త్ర వచనం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

