శుభవాస్తు
ఇంటి నిర్మాణానికి పెరిగిన మూలలు పనికిరావు. అలాంటివి తొలగించి, ఎంత సెట్‌బ్యాక్ వదలాలో చూసుకొని, దానికి తగిన ఇంటినే కట్టాలి. మీరు మూలలు పెరిగినవి చూపించడం వల్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణ స్థలం రావడం సరిగ్గా ఉండదు.
మూలలు పెరిగిన స్థలాన్ని చూపించి, ఇల్లు పర్మిషన్ తీసుకున్నాం. ఇల్లు ఎలా కట్టాలి?
– వి. సారథి, మారేడ్‌పల్లి
ఇంటి నిర్మాణానికి పెరిగిన మూలలు పనికిరావు. అలాంటివి తొలగించి, ఎంత సెట్‌బ్యాక్ వదలాలో చూసుకొని, దానికి తగిన ఇంటినే కట్టాలి. మీరు మూలలు పెరిగినవి చూపించడం వల్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణ స్థలం రావడం సరిగ్గా ఉండదు. స్థలశుద్ధి లేని.. అంటే, దిశలలో సరిగ్గా మూలమట్టానికి సరిచేయని స్థలంలో ఎలాంటి నిర్మాణం చేయవద్దు. అప్పుడు ఇల్లు పూర్తికాదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి. మీరు మీ స్థలాన్ని ముందుగా సరిచేసుకోండి. అన్ని మూలలు మెట్నకు బాగు చేసుకొని, దానిలో ఎంత వైశాల్యం ఇల్లు వస్తే అంతలోనే కట్టండి. చక్కని డూప్లెక్స్ కూడా ప్లాన్ చేయవచ్చు. అంతేకానీ, స్థలం ఎలా ఉంటే అలా గృహం కడతానంటే సమస్యలు వస్తాయి. విదిక్కులు (మూలలు) పెరిగిన స్థలాల్లో ఇండ్లు కడుతుంటే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బియ్యంలో రాళ్లు ఏరకుండానే అన్నం వండము కదా! ఇల్లు కూడా అంతే!

Sridhar
స్థలంలో బండ ఉంది. దానిలో ఇల్లు ఎలా కట్టాలి? ఎత్తుగా చేసి, సగం ఇల్లు కట్టవచ్చా? ఉత్తరం రోడ్డు ఉంది. – కె. శ్రీధర్, ఘనపురం
స్థలంలో ఎత్తుగా బండ (గుట్ట) వచ్చినప్పుడు అది దక్షిణం కదా! పడమర కదా! అని అలాగే ఎత్తుచేసి, కింద ఇల్లు, దానిమీద ఇల్లు.. ఇలా డూప్లెక్స్ ప్లాన్ చేసి కట్టడం మంచిదికాదు. ఉత్తరం వీధి ఉన్న స్థలం కాబట్టి, మీరు ముందుగా ఆ బండను తొలగించి, స్థలాన్ని చదును చేయండి. పిదప ఆ స్థలాన్ని బట్టి చుట్టూ పద్ధతి ప్రకారంగా ఖాళీ వదిలి, ఇంటిని ప్లాన్ చేసుకోండి. సగం ఇల్లు ఎత్తు.. సగం ఇల్లుపైన కట్టడం మంచిదికాదు. దానివల్ల ఇంటిలో కొన్ని దిశలు లేకుండా పోతాయి. అంటే, ఆ దిశలు మనం వాడకుండా గుట్ట (బండ) వస్తుంది. ఆ విధమైన గృహాలలో ఆయా దిశల లోపం ఏర్పడి, చాలా దోషాలు (అంగ వైకల్యం) ఏర్పడినట్టుగా గృహం నిలిచిపోతుంది. నిర్మాణంలో మూలలు, దిశలు కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి, చూసి తెలుసుకొని ఇంటి నిర్మాణం చేయండి.

Lata
మా స్థలానికి దక్షిణంలో పది అడుగుల ఎత్తు ఉంది. దానిమీద రోడ్డు ఉంది. అది మాకు దోషం అవుతుందా? – కె. లత, జనగాం
మీరు కింద ఇల్లు కట్టి, మీద కూడా మరో అంతస్తు కట్టాలని అనుకుంటున్నారు. అప్పుడు అది వీధిపోటు అవుతుంది కదా! ఇంటికి దక్షిణం ఎత్తు ఉన్నప్పుడు దానిపైన కూడా ఇండ్లు కట్టి రోడ్లు ఉంటే.. ఆ ఇండ్లు, తూర్పు రోడ్డు మీ ఇంటి స్థలానికి దక్షిణంలో వచ్చి ఆగుతుంది. అంటే, అది మీ స్థలానికి దక్షిణం వీధిపోటు అవుతుంది. మీరు దానికన్నా పది అడుగులు కిందికి ఉన్న ఉత్తరం వీధి స్థలం తీసుకున్నారు. కానీ, మీకు అది దక్షిణం రోడ్డుపోటు వస్తుంది. అదికూడా పెద్ద దోషమే! ఎత్తు మీద ఉన్నంత మాత్రాన వీధిశూలలు దోషం కాకుండా పోదు. ఒక స్థలంలో కింద వదిలి పైన కూడా.. రేపటి రోజుల్లో ఎన్నో బహుళ అంతస్తులు కట్టాల్సి వస్తుంది. అప్పుడు వీధిమాత్రం పోదుకదా! మీరు ఆ స్థలంలో ఇల్లు కట్టే ఆలోచన మానుకోండి. అలాగని కిందికే ఇల్లు కడతాం. పైన కట్టుకోం అనుకోవద్దు. భవిష్యత్తు మనం నిర్ణయించలేం.

Srilata
విదిక్కుల ఇల్లు, సెల్లార్ తీసి కట్టారు. దానిని కొనవచ్చా? పడమరలో రోడ్డు ఉంది.
– ఎం. శ్రీలత, వివేకానంద నగర్
విదిక్కులు అంటే దిశలు సరిగ్గా ఉండని స్థలం. మీ రోడ్డు పడమరలో ఉంటే.. అది పశ్చిమ-వాయవ్యం రోడ్డు అవుతుంది. తూర్పు రోడ్డు ఉంటే.. అది ఆగ్నేయం రోడ్డు అవుతుంది. వాస్తవానికి ఈ దిశలు లేని స్థలాలు గృహాలకు పనికిరావు. వ్యాపార స్థలాల కోసం ఉపయోగపడతాయి. అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టి, దానికి సెల్లార్ తీయడం మంచిదికాదు. మీరు ఇంటికోసం అయితే, అది కొనకండి. లేదు ఆ స్థలం ‘కమర్షియల్’గా వాడుకోవడం కోసం అయితే తీసుకోండి. లేదా ఉన్న నిర్మాణాన్ని సరిచేసి, వ్యాపారంగా షాపులు చేయవచ్చా? లేదా తీసి కట్టాలా? అనేది చూడండి. విదిశల స్థలాలను క్షుణ్నంగా చూసి మరీ నిర్ణయం తీసుకోవాలి. కేవలం గృహం కోసమే అయితే.. ఆ స్థానం మీకు పనికిరాదు.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
98492 78143
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

