శుభవాస్తు
ఒక అంతస్తులో ఉండి పైన సగం మాత్రమే కలుపుకోవడం మంచిదికాదు. డూప్లెక్స్ ఇల్లు అంటేనే రెండు ఫ్లోర్లు. కింద ఎంతవరకు ఇల్లు ఉంటుందో.. పైనకూడా అంతే వైశాల్యంగా ఇల్లు ఉండాలి. మీ ఉద్దేశం టెర్రస్‌ను సగం మాత్రమే వాడుకొని, మిగతా సగభాగం పైన ‘ఓపెన్ టు స్కై’ చేద్దామని. తద్వారా ఇంటి లోపలి ఆవరణంలో వ్యత్యాసం వస్తుంది.
ఒక ఫ్లోర్‌ను పూర్తిగా ఇల్లు చేసుకొని, పైన సగం ఫ్లోర్‌ను డూప్లెక్స్గా మార్చి, లోపలి నుంచి వాడుకోవచ్చా?
– బి. ఈశ్వర్, కోరుట్ల
ఒక అంతస్తులో ఉండి పైన సగం మాత్రమే కలుపుకోవడం మంచిదికాదు. డూప్లెక్స్ ఇల్లు అంటేనే రెండు ఫ్లోర్లు. కింద ఎంతవరకు ఇల్లు ఉంటుందో.. పైనకూడా అంతే వైశాల్యంగా ఇల్లు ఉండాలి. మీ ఉద్దేశం టెర్రస్‌ను సగం మాత్రమే వాడుకొని, మిగతా సగభాగం పైన ‘ఓపెన్ టు స్కై’ చేద్దామని. తద్వారా ఇంటి లోపలి ఆవరణంలో వ్యత్యాసం వస్తుంది. పైనకూడా అవసరం కోసం వాడాలి అనుకున్నప్పుడు.. డూప్లెక్స్ ఆలోచన వద్దు. గ్రౌండ్ నుంచి మొదటి అంతస్తును కలిపి రెండూ ఒకే వైశాల్యంతో డూప్లెక్స్ చేయండి. లేదా ఫస్ట్‌ఫ్లోర్ పూర్తిగా వాడి, బయటి నుంచి మెట్లు పెట్టుకొని టెర్రస్ మీద సగం వాడుకోండి. అంటే.. లోపలి నుంచి కాకుండా బయటి నుంచే వాడుకోవాలి. విరుద్ధ ఆవరణం చేయడం వల్ల ప్రధానంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలు వస్తాయి.
బెడ్రూమ్ కంటే.. బాత్రూమ్ ఫ్లోరింగ్ కిందికి ఉండొచ్చా?
– ఎస్. రాజమణి, అనంతారం
ఇంటిలోని ఫ్లోరింగ్ లెవల్ అంతటా ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. ముఖ్యంగా టాయిలెట్ ఏరియాల్లో ‘సంకెన్’ స్లాబ్ (కిందికి) వేస్తున్నారు. అలా వేసుకుంటే ఇబ్బంది లేదు. అదికూడా లీకేజ్ లేకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు ఆలోచన మారి టాయిలెట్ స్థానాన్ని మారుస్తారు. కాబట్టి, ఆ టాయిలెట్ స్థానంలో పైపుల కోసం ఎత్తు చేయాల్సి వస్తుంది. అవసరమైనంత ఎత్తు చేసుకున్నా ఫర్వాలేదు. మరీ ఎత్తు పనికిరాదు. అయితే, బెడ్రూమ్ కన్నా కిందికి చేయకుండా జాగ్రత్త పడాలి. గది ఫ్లోరింగ్, టాయిలెట్ ఫ్లోరింగ్ ఒకే లెవల్లో వచ్చినప్పుడు టాయిలెట్ నీరు గదిలోకి రాకుండా.. సిమెంట్ గడప కూడా పెట్టుకోవచ్చు. అలాగే, కుండీ భాగం కూడా సపరేట్గా ఎత్తు చేసుకోవచ్చు. దోషం కాదు.

Toilet
పడమర, ఉత్తరం రోడ్డు ఉన్న షాపులో ఎటువైపు కూర్చోవాలి?
– పి. రమేశ్, మెట్పల్లి
మీ షాపు వాయవ్యం బ్లాకులో ఉంది. మంచిదే! మీరు పడమర-ఉత్తరం ఉన్న షట్టర్లను వాడుకోవచ్చు. ఉత్తరం ప్రధానంగా షాపు చేసినట్లయితే.. ఉత్తర-వాయవ్యంలో తూర్పు ముఖంగా బల్ల (టేబుల్) వేసుకొని కూర్చోండి. రెండు రోడ్లు వాడాలి, రెండు వైపులా ఓపెన్‌గా మనుషులు నడిచేలా ఉండాలి అంటే.. మీ స్థానం నైరుతిలో ఏర్పాటు చేసుకోండి. ఆచోట ఉత్తరం ముఖంగా ఉండేలా కూర్చోండి. షాపునకు ఉత్తర-ఈశాన్యంలో ద్వారం.. పశ్చిమ-వాయవ్యంలో ఒక ద్వారం పెట్టుకోండి. ద్వారాలు పెట్టుకోగా మిగిలిన భాగం.. గ్లాస్‌తో మూసేయండి. సామగ్రి అంతాకూడా దక్షిణం-పడమర వైపు అమర్చుకోండి. మీరు కూర్చున్న చోట కుడివైపు ‘లాకర్ (గల్లాపెట్టె) పెట్టుకోండి. గోడలకు అన్నివైపులా షెల్ఫులు వేసుకోవచ్చు. దోషం ఉండదు.

Office
మాకు ఉన్న ఉత్తరం రోడ్డు స్థలానికి ఉత్తరం మూలనుంచి రోడ్డు వస్తున్నది. అందులో మూడు ఇండ్లు ఎలా కట్టాలి?
– వి. శ్రీరామ్, జీడికల్
పెద్ద స్థలంలో ఇండ్లు ఎన్ని వస్తే అన్ని కట్టొచ్చు. కానీ, అన్నిటికీ భౌతిక హద్దులు పాటించాలి. మీ స్థలానికి ఉత్తర-ఈశాన్యం వీధి చూపు వస్తున్నది అంటున్నారు. ముందుగా.. ఆ వీధి వెడల్పు ఎంత అనేది కొలిచి, మార్కింగ్ చేసి పెట్టాలి. మీరు ముగ్గురు అన్నదమ్ములు ఆ స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలి. అప్పుడు ఆ వీధిపడే భాగానికి ఎదురుగా వస్తున్న ఆ రోడ్డు ‘వీధిచూపు’ అవుతుందా? ‘వీధిపోటు’ అవుతుందా? అనేది నిర్ధారించాలి. ఆ రోడ్డు వీధిపోటుగా మారితే.. అప్పుడు ఆ స్థలంలో మూడు భాగాలు చేయడం కుదరదు. రెండు భాగాలు మాత్రమే చేయాలి. అది సరిచూసుకోండి. మీరు అన్నదమ్ములు పైభాగం నుంచి అంటే.. పడమర నుంచి వరుసగా పెద్దవారు తీసుకొని, తూర్పు భాగం చిన్నవారు ఉండాలి. వీధిచూపు అయినా.. విభజించినప్పుడు దాని స్వరూపం మారుతుంది. కాబట్టి, సరిగ్గా చూపించి, సలహాలు-సంప్రదింపులు చేసి.. మంచి ఇండ్లు కట్టుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

