దీపాల సొగసును ఇనుమడించే ‘ఫ్లవర్ దియాస్’
దీపాల సొగసును ఇనుమడించేలా ‘ఫ్లవర్ దియాస్' రూపుదిద్దుకుంటున్నాయి. తీరొక్క పువ్వులతో అలంకరించిన ఈ ప్రమిదలు పండుగకు కొత్త శోభను తీసుకొస్తున్నాయి.
పువ్వల్లే.. విరిసే దివ్వెల్
దీపావళి సిరికాంతుల పండుగ. ఆనాడు ఇంటింటా దివ్వెలు వెలుస్తాయి. అవే పువ్వులై వెలుగులీనితే ఇంకెంత బాగుంటుందో కదూ! అటు పండుగ అలంకరణకు సరిపోయేలా, ఇటు దీపాల సొగసును ఇనుమడించేలా ‘ఫ్లవర్ దియాస్’ రూపుదిద్దుకుంటున్నాయి. తీరొక్క పువ్వులతో అలంకరించిన ఈ ప్రమిదలు పండుగకు కొత్త శోభను తీసుకొస్తున్నాయి.
చెడు మీద మంచి విజయాన్ని చీకటి వెలుగుల్లో చూపిస్తుంది దీపావళి. అంబరాన్నంటే వెలుగుపూలు అంతెత్తు ఆనందానికి ప్రతీకలు. అవే రోజులు లక్ష్మీదేవికి ప్రీతికరాలు కూడా. ఆమె పూజ కోసం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తాం. పూల రంగవల్లులు తీర్చిదిద్దుతాం. ఈ రెండూ వేటికవే మనోహరాలు. వీటి అందాల్ని ఒక్కచోట చేర్చి, పువ్వుల్లోనే దివ్వెల వెలుగుల్ని ఆవిష్కరిస్తున్నాయి కొత్తగా మార్కెట్లో దొరుకుతున్న ఫ్లవర్ డెకరేటెడ్ దియా లేదా క్యాండిల్ హోల్డర్లు. వీటితో అటు అందం ఇటు అలంకారం.

Flower Diyas
పువ్వుల దీపావళి…
చిన్న దీపం పెట్టి చుట్టూ పుష్పాలతో అలంకరిస్తే ఎలా ఉంటుందో ఈ ఫ్లవర్ డెకరేటెడ్ దియాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మధ్యలో ఒక కొవ్వొత్తి ఉండి చుట్టూ రంగురంగుల పూలు అతికించి ఉంటాయి. చిన్న పూల పళ్లెంలా కనిపిస్తాయివి. అలా కాకుండా ఒక్కో కొవ్వొత్తీ ఒక్కో పువ్వులా కనిపించే తరహావీ ఉన్నాయి. అంటే ఇక్కడ నేరుగా పువ్వునే వెలిగిస్తామన్న మాట. ఈ తరహా వాటిల్లో గులాబీ, తులిప్, ప్రొద్దుతిరుగుడు… ఇలా భిన్నమైన రకాలు తయారవుతున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఇవి దీపావళి నాడు ఇంటి అలంకరణకు బాగా నప్పుతాయి.
ముగ్గులకు కొత్త అందాన్నిస్తాయి. అంతేకాదు, ఇతర పండుగల వేళల్లోనూ ప్రమిదల్లా వీటిని ఉపయోగించుకోవచ్చు. పూసలు, కుందన్లు, రాళ్లను పొదిగి కూడా ఈ తరహా దివ్వెలు ముస్తాబవుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ఆన్లైన్ సైట్లలో వివిధ వెరైటీల్లో దొరుకుతున్నాయివి. మనం ఇంట్లో వాడుకునేందుకు కొనుక్కున్నా, ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చినా బాగుంటాయి. మరి ఈ దీపావళికి మీరూ వెలిగిస్తారా పువ్వుల దివ్వెలు!

Flower Diyas 1

Flower Diyas 2

Flower Diyas 3

Flower Diyas 4

Flowers Diyas 5
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- beauty
- crafted
- Flower Diyas
- lamps
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

