అవే అందమైన జ్ఞాపకాలు!
బ్రిటన్ భామ అమీ జాక్సన్.. చిత్రసీమను వెతుక్కుంటూ ‘మద్రాసపట్టిణం’లో అడుగు పెట్టింది. ‘ఎవడు’తో తెలుగు తెరపై మెరిసింది. క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐ, 2.0 సినిమాలతో జనానికి మరింత దగ్గరైంది. చాలా గ్యాప్ తర్వాత.. ‘క్రాక్'తో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది.
- కార్వాన్ కబుర్లు
బ్రిటన్ భామ అమీ జాక్సన్.. చిత్రసీమను వెతుక్కుంటూ ‘మద్రాసపట్టిణం’లో అడుగు పెట్టింది. ‘ఎవడు’తో తెలుగు తెరపై మెరిసింది. క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐ, 2.0 సినిమాలతో జనానికి మరింత దగ్గరైంది. చాలా గ్యాప్ తర్వాత.. ‘క్రాక్’తో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది. తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఇలా పంచుకున్నది…
లాక్‌డౌన్‌కు కొన్ని నెలల ముందే నేను తల్లినయ్యా! సినిమాలూ, షూటింగ్‌లూ అన్నీ బంద్! దీనివల్ల, నా బిడ్డతో ఎక్కువసేపు గడిపే అదృష్టం దక్కింది. ఆ సమయం నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతుల్ని పంచింది.
ఇటీవలి చిత్రాలలో ‘యానిమల్’ నాకు బాగా నచ్చింది. పుష్ప, కేజీఎఫ్ కూడా బాగున్నాయి. ఇలాంటి భారీ యాక్షన్ సినిమాలు తీసిన దక్షిణాది దర్శకులు సుకుమార్, ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయాలని ఉంది. కరణ్ జోహర్ చిత్రంలోనూ భాగం కావాలనేది నా కోరిక. ఏదో ఒకరోజు నా ఆశ నెరవేరుతుందని అనుకుంటున్నా.
సినిమాలకు భాష లేదని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిందంతా.. ఇంగ్లండ్‌లోనే. కానీ, కెరీర్‌ను మొదలుపెట్టింది తమిళంలో. తెలుగు, హిందీ సినిమాలు కూడా చేశాను. హిందీ, ఇంగ్లిష్, జర్మన్.. సినిమాలో మీరు ఏ భాష మాట్లాడుతున్నారనేది ముఖ్యం కాదు. ప్రేక్షకులను ఆ సినిమాలో లీనం చేయడం, ఆ పాత్రల్లో ఒకరిగా అనుభూతిని కలిగించడం ముఖ్యం.
మా కుటుంబానికి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. నేను కూడా నటిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. నా పదహారో ఏట మాడల్‌గా కెరీర్ ప్రారంభించాను. 2009లో ‘మిస్ టీన్ వరల్డ్’గా ఎంపికయ్యా. ఆ తర్వాత తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ నన్ను ‘మద్రాసపట్టిణం’ కోసం ఎంపిక చేశారు. దాంతో ఓవైపు మాడల్‌గా కొనసాగుతూనే.. సినిమాల్లోకి వచ్చాను.
ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ లేరు. శంకర్ దర్శకత్వంలో పనిచేయడం, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణ నటుడితో తెరను పంచుకోవడం.. నన్ను మంచి నటిగా నిలబెట్టాయి. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సూచనలూ చిత్రసీమలో ఎదిగేందుకు దోహదపడ్డాయి.
నా ఉద్దేశంలో ప్రేమ అంటే.. ఒకరి పట్ల ఒకరు గౌరవం, అవగాహన కలిగి ఉండటం. ఇద్దరూ కలిసి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడం. కమ్యూనికేషన్, నమ్మకం, పరస్పర మద్దతు.. బంధాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచే సాధనాలు.
ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో గడపడం నాకు చాలా ఇష్టం. సాయంత్రం పొలాల్లో షికార్లు చేయడం.. సూర్యాస్తమయంలో గుర్రపు స్వారీలో మునిగిపోవడం.. చీకటి పడ్డాక ఏదైనా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తూ నిద్రలోకి జారుకోవడం.. ఇవన్నీ ఎంతో అందమైన జ్ఞాపకాలు.
వృత్తిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అందుకోసం నా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నా. నా కొడుకును కూడా సినిమా సెట్స్‌కు తీసుకెళ్తున్నా. దీనివల్ల తనను దగ్గరుండి చూసుకోగలుగుతున్నా. అంతేకాదు.. తన కోసం తల్లి ఎంత కష్టపడి పనిచేస్తున్నదీ నా కొడుకు తెలుసుకోవాలి కదా!?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
CISF | రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర.. ఇదీ సీఐఎస్ఎఫ్ జవాన్ల దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

