Jannik Sinner | యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగిన మాజీ ఛాంపియన్.. కారణమిదే..!
Jannik Sinner : ప్రతిష్ఠాత్మక యూఎప్ ఓపెన్ నుంచి పురుషుల సింగిల్స్ ఫేవరెట్ జనిక్ సినర్(Jannik Sinner) వైదొలిగాడు. అమెరికా వేదికగా జరిగే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తాను ఆడడం లేదని శుక్రవారం వెల్లడించాడు.
Jannik Sinner : ప్రతిష్ఠాత్మక యూఎప్ ఓపెన్ నుంచి పురుషుల సింగిల్స్ ఫేవరెట్ జనిక్ సినర్(Jannik Sinner) వైదొలిగాడు. అమెరికా వేదికగా జరిగే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తాను ఆడడం లేదని శుక్రవారం వెల్లడించాడీ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్‌లో గాయపడిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో, గాయం నుంచి కోలుకొని ఎంట్రీ ఇస్తున్న కార్లోస్ అల్కరాజ్, సినర్ మధ్య మరోమారు అసలైన టెన్నిస్ సమరం చూడాలనుకున్న అభిమానులు షాక్‌లో ఉండిపోయారు.
యూఎస్ ఓపెన్ ఆరంభానికి ముందే స్టార్ ఆటగాడు జనిక్ సినర్ షాకిచ్చాడు. ఊహించినట్టు అతడు ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్‌లో గాయపడిన అతడు ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆడడం లేదని స్పష్టం చేశాడు. కుడి మోకాలి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు నంబర్ 1 ప్లేయర్. రెండేళ్ల క్రితం ఇదే వేదికపై సగర్వంగా ట్రోఫీని ముద్దాడు సినర్.
Even though I have been working hard with my team and my medical staff, we have now had to make the difficult decision that I will not be able to compete at the US Open this year. We have been back on court in Monte Carlo over the last couple of days and have realised that I… pic.twitter.com/9eoYS29jpO
— Jannik Sinner (@janniksin) August 21, 2026
‘యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు నా బృందం, వైద్య సిబ్బందితో కలిసి నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. కానీ, చివరికి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో నేను ఆడడం లేదు. మాంటేకార్లే ఈవెంట్లో ఆడుతుండగానే.. నా కుడి మోకాలి గాయం తీవ్రత తెలిసింది. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. టోర్నీ నుంచి వైదొలుగుతున్నందుకు నిరాశ చెందుతున్నా. నా హృదయంలో న్యూయార్క్‌కు ప్రత్యేక స్థానముంది. మళ్లీ మీ అందరిని కలిసేందుకు, ఇక్కడ ఆడేందుకు నేను ఆతృతగా ఉన్నా’ అని సినర్ పేర్కొన్నాడు. మరోవైపు గాయంతో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌కు దూరమైన అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌లో పోటీపడుతున్నాడు. ఆగస్టు 23 నుంచి ఈ మెగా టోర్నీ మొదలవ్వనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

