Varun Chakaravarthy : పొట్టి క్రికెట్లో భారత ఆటగాడు వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) సంచలనం సృష్టించాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్ రెండొందల వికెట్ల క్లబ్లో చేరాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని ఔట్ చేయడం ద్వారా వరుణ్ ఈ ఫీట్ సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 200ల వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా అవతరించాడు. మొత్తంగా.. ఐదో బౌలర్‌గా ఘనత సొంతం చేసుకున్నాడీ లెగ్ స్పిన్నర్.
ఐపీఎల్ సంచలనంగా భారత జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి టీ20ల్లో రెండొందల వికెట్లు తీశాడు. పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్‌తో మళ్లీ ఫామ్ అందుకున్న ఈ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) రికార్డును బ్రేక్ చేశాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ 160 ఇన్నింగ్స్‌ల్లో 200 వికెట్లు తీయగా వరుణ్ కేవలం 155 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ క్లబ్లో చేరాడు.
PARTNERSHIP BROKEN!! 👊
Varun Chakaravarthy gets the first breakthrough for #KKR with his 200th T20 wicket 🙌
Ramandeep Singh with the catch in the deep 🫴
Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR pic.twitter.com/mJvw3g5nhW
— IndianPremierLeague (@IPL) April 19, 2026
భారత బౌలర్లలో అందరికంటే తక్కువగా151 ఇన్నింగ్స్‌ల్లో రెండొందల వికెట్లతో అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జయదేవ్ ఉనాద్కాట్(162 ఇన్నింగ్స్‌లు), షమీ(165 ఇన్నింగ్స్‌లు)లు నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), సునీల్ నరైన్(వెస్టిండీస్).. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అశ్విన్, హార్దిక్ పాండ్యాలు సైతం రెండొందల వికెట్ల వీరుల జాబితాలో ఉన్నారు.
Big wicket & a special one for @chakaravarthy29! 💜
200th T20 wicket! He becomes the joint-fastest Indian bowler to reach the milestone, alongside Arshdeep and Kuldeep 👏#TATAIPL 2026 ➡️ #KKRvRR | LIVE NOW 👉 https://t.co/WYRBfg1pqf pic.twitter.com/xx7SnWOEqu
— Star Sports (@StarSportsIndia) April 19, 2026