ఒలింపిక్ ప్రేక్షకులకు కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..

టోక్యో: జపాన్‌లో జూలైలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ క్రీడా పోటీలను వీక్షించాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్‌తో స్టేడియానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ జరుగుతున్న వేదికల వద్దకు వెళ్లాలంటూ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఇవాళ జపాన్ మీడియా పేర్కొన్నది. మెగా ఈవెంట్‌కు ముందు వారం రోజుల లోపు తీసిన పీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌ను ప్రేక్షకులు స్టేడియాలకు తీసుకురావాలని ఓ పత్రిక ప్రచురించింది. ఒకవేళ సదరు ప్రేక్షకుడు అంతకుముందే వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే.. పీసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదని ఆ కథనంలో తెలిపారు. క్రీడలను వీక్షించాలనుకుంటున్న ప్రేక్షకులు తమ స్వంత ఖర్చుతోనే పీసీఆర్ టెస్ట్‌లు చేయించుకోవాలని కథనంలో రాశారు. అయితే వేదికల్లోకి స్థానిక ప్రేక్షకులకు అనుమతి కల్పిస్తారా లేదా అన్న విషయంపై టోక్యో ఒలింపిక్ నిర్వాహకులు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో.. టోక్యోతో పాటు మరికొన్ని జిల్లాలో జూన్ 20వ తేదీ వరకు ఎమర్జెన్సీ విధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

