అలా చేయకూడదని కాదు.. ఆ మంచాలు దృఢంగా ఉన్నాయి
మరోనాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌కు అథ్లెట్లు చేరుకుంటున్నారు.
టోక్యో: మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌కు అథ్లెట్లు చేరుకుంటున్నారు. అయితే ఆ అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన మంచాలపై విమర్శలు వస్తున్నాయి. ఆ మంచాలు శృంగారానికి పనికి రావు అని కొందరు అథ్లెట్లు ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు. కానీ అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. తమ ట్విట్టర్ అకౌంట్లో వాళ్లు ఈ విషయాన్ని చెప్పారు. శృంగారానికి సరిపడే రీతిలో మంచాలు దృఢంగా లేవని, ఆ మంచాలు యాంటీ-సెక్స్ అనే విమర్శలు వచ్చాయి. అయితే ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్క్లినాగన్.. తన రూమ్‌లో ఉన్న కార్డ్బోర్డ్ మంచంపై ఎగిరి గంతులేశాడు. సామాజిక దూరాన్ని ప్రోత్సహించే రీతిలో మంచాలను తయారు చేసినట్లు వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. జిమ్నాస్ట్ మెక్క్లినాగన్ ఆ వార్తలను తప్పుపట్టే రీతిలో మంచంపై ఎగిరెగిరి గంతులేశాడు. ఆ వీడియోను తమ ట్విట్టర్లో పోస్టు చేసిన నిర్వాహకులు .. కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు చెప్పారు.
ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఒలింపిక్ విలేజ్‌లో వేలాది మంది అథ్లెట్లు బస చేయనున్నారు. దాదాపు లక్షా 60 వేల కండోమ్‌లను అథ్లెట్లకు పంపిణీ చేయనున్నారు. నిజానికి క్రీడల సమయంలో ఆ కండోమ్‌లు వాడుకోవడానికి ఇవ్వడంలేదు. కానీ స్వదేశానికి వెళ్లిన తర్వాత ఎయిడ్స్ లాంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వాటిని ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Thanks for debunking the myth.😂You heard it first from @TeamIreland gymnast @McClenaghanRhys – the sustainable cardboard beds are sturdy! #Tokyo2020 https://t.co/lsXbQokGVE
— The Olympic Games (@Olympics) July 19, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

