నయా చాంపియన్.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత సబలెంకా
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నయా చాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను బెలారస్ బ్యూటీ అరీనా సబలెంకా అద్భుతంగా ఒడిసిపట్టుకుంది.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం
- ఫైనల్లో రిబకీనాపై అద్భుత విజయం
- నేడు జొకోవిచ్, సిట్సిపాస్ టైటిల్ పోరు
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నయా చాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను బెలారస్ బ్యూటీ అరీనా సబలెంకా అద్భుతంగా ఒడిసిపట్టుకుంది. రాడ్లీవర్ ఎరీనా వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కజకిస్థాన్ భామ రిబకీనాపై సబలెంకాదే పైచేయి అయ్యింది. ఫైనల్ ఫైట్ అంటే ఇలా ఉండాలన్న రీతిలో ఈ ఇద్దరు పవర్గేమ్తో అభిమానులను కట్టిపడేశారు. ఢీ అంటే ఢీ అన్నట్లు కొదమసింహాల్లా కొట్లాడారు. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో కసిగా పోరాడారు. తొలి సెట్ చేజార్చుకున్నా..ఏ మాత్రం వెనుకకు తగ్గని సబలెంకా వరుస సెట్లలో రిబకీనాను ఓడించి మెల్బోర్న్ క్వీన్‌గా నిలిచింది. ఈ ఏడాది అపజయమెరుగకుండా కొనసాగుతున్న సబలెంకా రానున్న రోజుల్లో మరిన్ని టైటిళ్లు కొల్లగొడుతానంటూ ఆత్మవిశ్వాసం కనబరిచింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బెలారస్ అందాల భామ అరీనా సబలెంకా చిరునవ్వులు చిందించింది. ఇన్ని రోజులు దక్కినట్లే దక్కి దక్కకుండా పోతున్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సబలెంకా ఎట్టకేలకు ఒడిసిపట్టుకుంది. పోరాటాన్ని తన ఆయుధంగా మలుచుకున్న సబలెంకా..ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నయా చాంపియన్‌గా నూతన అధ్యాయం ప్రారంభించింది. శనివారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదోసీడ్ సబలెంకా 4-6, 6-3, 6-4తో ఎలెనా రిబకీనా(కజకిస్థాన్)పై చిరస్మరణీయ విజయం సాధించింది. రెండు గంటల 28నిమిషాల పాటు జరిగిన పోరులో సబలెంకా 17 ఏస్‌లు, 51 విన్నర్లు, ఏడుసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడింది. మొత్తంగా 13 బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు తొమ్మిది ఏస్‌లు సంధించిన రిబకీనా..ఒక డబల్ ఫాల్ట్, 31 విన్నర్లు ఖాతాలో వేసుకుంది. ఏడు బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే నిలబెట్టుకుంది. ఈ విజయంతో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సబలెంకా రెండో ర్యాంక్ దక్కించుకోనుంది.
పుంజుకుని పోటీలోకి
ఈ ఏడాది ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా వరుసగా పది విజయాలతో ఫైనల్లోకి ప్రవేశించిన సబలెంకాకు రిబకీనా ఆదిలోనే షాక్ ఇచ్చింది. మూడో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబకీనా 3-1 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సబలెంకా పోటీలోకి వచ్చి 4-4తో సమం చేసినా తొమ్మిదో గేమ్‌లో సర్వీస్ కోల్పోయి సెట్‌పై పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా పదో గేమ్ సర్వీస్ నిలబెట్టుకున్న రిబకీనా తొలి సెట్ దక్కించుకుంది. అయితే రెండో సెట్లో సబలెంకా బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది. మూడో గేమ్‌లో రిబకీనా సర్వీస్ బ్రేక్ చేసిన అరీనా..సర్వీస్ కాపాడుకుంటూ 4-1తో ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత రిబకీనా రెండు సర్వీస్‌లు కాచుకున్నా..సబలెంకా ఎక్కడా అవకాశమివ్వకుండా సెట్ కైవసం చేసుకుని పోటీలో నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీంతో ఒక దశలో 3-3తో స్కోరు సమమైంది. ఏడో గేమ్‌లో 40-0తో బ్రేక్ పాయింట్ కాచుకున్న సబలెంకా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే దూకుడుతో ఎనిమిదో గేమ్‌ను నిలబెట్టుకుని ఆధిక్యాన్ని 5-3కు పెంచుకుంది. ఆఖర్లో పదో గేమ్‌ను తన వశం చేసుకున్న సబలెంకా సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆనందంలో సబలెంకా భావోద్వేగానికి లోనైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

