చాంప్ స్వియాటెక్
- రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
- ఫైనల్లో గాఫ్ ఓటమి
వరుస విజయాలిచ్చిన జోష్ ముందు.. యంగ్ తరంగ్ నిలువలేకపోయింది!
తిరుగులేని ఆధిపత్యం ముందు.. యువ రక్తం సత్తాచాటలేకపోయింది!
రెండోసారి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలనే కోరిక ముందు.. తొలి కప్పు కొట్టాలన్న తపన చిన్నబోయింది!
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ విజేతగా నిలిచింది. వరుసగా 34 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా రోలాండ్ గారోస్ ఫైనల్లో అడుగుపెట్టిన స్వియాటెక్ చాంపియన్ తరహా ఆటతీరుతో ఆకట్టుకోగా.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన 18 ఏండ్ల అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. స్వియాటెక్ కెరీర్లో రెండో టైటిల్ ఖాతాలో వేసుకోగా.. ఓడినా తన పోరాటంతో గాఫ్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నేడు జరుగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌తో నాదల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు!
పారిస్: ఇటీవలి కాలంలో నిలకడైన ఆటతీరుతో కట్టిపడేస్తున్న పోలాండ్ భామ ఇగా స్వియాటెక్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. నాలుగు నెలలుగా ఓటమన్నదే లేకుండా దూసుకెళ్తున్న స్వియాటెక్ శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 6-1, 6-3తో అమెరికా యంగ్‌స్టార్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. తద్వారా రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు ఇది వరుసగా 35వ విజయం కావడం విశేషం. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి పోలాండ్ ప్లేయర్‌గా గతంలోనే చరిత్రకెక్కిన స్వియాటెక్.. బహుమతి ప్రదానోత్సవంలో పట్టరాని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన పోరులో స్వియాటెక్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలి సర్వీస్ నుంచే ఒత్తిడిలో కనిపించిన గాఫ్.. ఏ దశలోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుస సెట్లలో సత్తాచాటిన స్వియాటెక్ ఒక ఏస్ సంధించగా.. గాఫ్ రెండు ఏస్‌లు బాదింది. 3 డబుల్ ఫాల్ట్స్ చేసిన గాఫ్.. ఒక బ్రేక్ పాయింట్ సాధించగా.. స్వియాటెక్ 5 బ్రేక్ పాయింట్లతో దుమ్మురేపింది. 2020 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. తొలిసారి మేజర్ టోర్నీ ఫైనల్ ఆడిన గాఫ్ మ్యాచ్ అనంతరం తన మాటతీరుతో అభిమానులను కట్టిపడేసింది.
తొలి నుంచే తడబాటు..
మొదటి సర్వీస్‌ను ఒకటికి రెండు సార్లు నెట్ దాటించలేకపోయిన గాఫ్.. ప్రత్యర్థికి అప్పనంగా ఆధిక్యం అందించగా.. దీన్ని సద్వినియోగ పరుచుకున్న స్వియాటెక్ వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోనే 4-0తో సంపూర్ణ ఆధిక్యంలో నిలిచిన స్వియాటెక్ అదే జోరుతో తొలి సెట్‌ను ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో కాస్త ప్రతిఘటన కనబర్చిన గాఫ్ మూడు గేమ్‌లు చేజిక్కించుకున్నా.. కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వియాటెక్ 18 విన్నర్లు సంధిస్తే.. గాఫ్ 14కు పరిమితమైంది. 24 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్ అందుకు మూల్యం చెల్లించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Grand Slam
- Roland Garros
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

