లైంగిక దాడి కేసులో లంక క్రికెటర్‌కు బెయిల్ ఇవ్వని ఆస్ట్రేలియా
Danushka Gunathilaka: శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు ఆస్ట్రేలియా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో అతని తరపున లాయర్ న్యూస్ సౌత్ వేల్స్‌లోని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆ కోర్టులో అర్జెంట్ బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు దనుష్కపై ఆరోపణలు ఉన్నాయి. సిడ్నీలోని ససెక్స్ హోటల్లో లంక క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మెల్బోర్న్: శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు ఆస్ట్రేలియా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో అతని తరపున వాదిస్తున్న లాయర్ న్యూస్ సౌత్ వేల్స్‌లోని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆ కోర్టులో అర్జెంట్ బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు దనుష్కపై ఆరోపణలు ఉన్నాయి. సిడ్నీలోని ససెక్స్ హోటల్లో లంక క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
31 ఏళ్ల గుణతిలక నవంబర్ 2వ తేదీన 29 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 29వ తేదీన డేటింగ్ యాప్ ద్వారా ఆ మహిళ గుణతిలకకు పరిచయం అయ్యింది. దనుష్కపై నాలుగు అభియోగాలు నమోదు చేశారు. ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడినట్లు అతనిపై కేసు బుక్ చేశారు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ స్టేజ్‌లో నమీబియాతో మ్యాచ్‌లో గుణతిలక ఆడాడు. లంక జట్టు తరపున దాదాపు వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
సర్రీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బేడీలతో ఉన్న గుణతిలక.. బెయిల్ కోసం డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టు ముందు వీడియో లింక్ ద్వారా హాజరయ్యాడు. అతని తరపున లాయర్ ఆనంద్ అమర్నాథ్ బెయిల్ పిటిషన్ వేశారు. మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. లోకల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం వల్ల సుప్రీంను ఆశ్రయించనున్నట్లు లాయర్ తెలిపారు.
ప్రవర్తన సరిగా లేని కారణంగా గతంలోనూ గుణతిలక సస్పెన్షన్‌కు గురయ్యాడు. తాజా కేసు మళ్లీ జనవరిలో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

