2023 World Cup: వన్డే వరల్డ్ కప్ 2023కు సౌతాఫ్రికా క్వాలిఫై
మంగళవారం ఐర్లాండ్ - బంగ్లా మధ్య జరిగిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో వన్డే ప్రపంచ కప్పు -2023కు సౌతాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది.
మంగళవారం ఐర్లాండ్ – బంగ్లా మధ్య జరిగిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో వన్డే ప్రపంచ కప్పు -2023కు సౌతాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. దీంతో ఐర్లాండ్ వన్డే వరల్డ్ కప్పులో పాల్గొనాలంటే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాలి.
బంగ్లా – ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే మంగళవారం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీల ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫీకర్ రహీమ్(61) అర్ధశతకం సాధించాడు. శాంటో, షకీబ్, మిరాజ్ రాణించారు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్ నుంచి వచ్చిన జోషువా లిటిల్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ అడైర్, హ్యూమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. 16.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 65 చేసింది. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపేశారు. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఐర్లాండ్ మూడుకి మూడు మ్యాచులు గెలిచినట్లైతే నేరుగా వన్డే వరల్డ్ కప్‌నకు క్వాలిఫై అయ్యేది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే సౌతాఫ్రికా వరల్డ్ కప్‌నకు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

